Rythu Bandhu: రైతు బంధు కింద రైతుల అకౌంట్లోకి రూ. 1. మీకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి..!!

రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమయ్యాయి. ఒక్కో రైతుకు ఒక్కోలా డబ్బులు పడ్డాయి. హన్వాడ మండలంలోని ఒక రైతుకు మాత్రం రూ. 1 మాత్రమే జమ అయ్యింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. 5ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయం అందుతోంది.

Rythu Bandhu: రైతు బంధు కింద రైతుల అకౌంట్లోకి రూ. 1. మీకు ఎంత వచ్చిందో చెక్  చేసుకోండి..!!
New Update

తెలంగాణ సర్కార్ విడుదల చేసిన రైతు బంధు డబ్బులు రైతులు అకౌంట్లో జమయ్యాయి. అయితే ఒక్కో రైతుకు ఒక్కో విధంగా డబ్బులు పడ్డాయి. ఒక రైతుకు రూ.1 మాత్రమే రైతు బంధు సాయం కింద అందించింది. రాష్ట్ర సర్కార్ నుంచి ఇన్ పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు రైతు అకౌంట్లో జమ అయ్యాయి. దీంతో ఆ రైతు ఒక్కసారి గా షాక్ అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమచేస్తున్నారు. యాసంగి సాగు కోసం ఈ డబ్బులను విడుదల చేసింది.

ఐదేకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం లభిస్తోంది. అయితే హన్వాడా మండలానికి చెందిన పాండురంగారెడ్డి అనే రైతుకు రైతు బంధు కింద రూ. 1 బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ రైతు షాక్ అయ్యాడు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందించింది. ఈ డబ్బులు రెండు విడతల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతుండేది. అయితే ఈ యాంసంగి సీజన్ మాత్రం రైతుకు రూ. 1 మాత్రమే లభించింది. నాకు 5 ఎకరాల పొలం ఉందని కేవలం రూ. 1 మాత్రమే జమ అయ్యిందని పాండురంగారెడ్డి తెలిపారు.

అదే మండలంలోని టంకర గ్రామంలో మరో రైతు ఆంజనేయులకు రైతు బంధు కింద రూ. 62 మాత్రమే లభించినట్లు తెలిపారు. 2గుంటలకు ఇది వరకు రూ. 250 వచ్చేవని సదరు రైతు చెప్పారు. ఆయనకు మరో సర్వే నెంబర్ లో 1.5 ఎకరాలు పొలం ఉంది. దీనికి డబ్బులు రాలేదు. ఇలా చాలా మంది రైతులకు ఇంకా రైతు బంధు డబ్బులు అందలేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  హమ్మయ్య అనుకునే లోపే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఎంతంటే.. 

#rythu-bandhu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe