Vundavalli Press Meet : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు సరైన అవకాశం వచ్చిందన్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ (Nitish Kumar) పైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు మీదే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. పవన్ అంటే గాలి అని.. కానీ ఏపీలో పెను తుఫాన్ వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ తాపత్రయ పడకపోతే ఈ పొత్తు కుదిరేది కాదన్నారు. ఈ పొత్తు లేకపోతే మోదీకి కచ్చితంగా నష్టం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టే మోదీ ప్రశాంతంగా ప్రధానమంత్రి అయ్యారన్నారు. ఏపీలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ (YCP) అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధికి గతంలో ఏడు సీట్లే వచ్చిన విషయాన్ని గర్తు చేశారు. అయినా.. వాళ్లు ప్రతిపక్షంలో పోరాటాలు చేసి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే రాష్ట్రం నష్టపోతుందన్నారు.
గతంలో టీడీపీ హయంలో, ఆ తర్వాత వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర ఎవరూ పూర్తిగా పోషించలేదన్నారు. నిస్సత్తువ, నిస్సాయత ఉన్నవాళ్లు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. బడుగు బలహీన వర్గాల వారిపై లిక్కర్ రేట్ల పెరుగుదల ప్రభావం చూపిందన్నారు. నియోజవర్గ పునర్విభజనలో చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇంటిదగ్గర గోడ విషయంలో గొడవ జరిగినట్లు అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రతినిధులకు మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
Also Read : సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి షాక్