మాధవి మర్డర్ కేసులో బిగ్ అప్డేట్.. బట్టలు తీసి బాత్రూంలోకి లాక్కెళ్లి!

మాధవి మర్డర్ కేసులో బిగ్ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇంట్లో దొరికిన టిష్యూ పేపర్‌‌లో మాధవి డీఎన్‌ఏ మ్యాచ్ అయింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులకు దొరికిన  టిష్యూను డీఎన్‌ఏ టెస్టుకు పంపగా... అవి ఆమె పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్ అయింది.

New Update
guru murthy

guru murthy Photograph: (guru murthy)

ఈ ఏడాది జనవరిలో మీర్ పేట్ లో జరిగిన మాధవి మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో బిగ్ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇంట్లో దొరికిన టిష్యూ పేపర్‌‌లో మాధవి డీఎన్‌ఏ మ్యాచ్ అయినట్లుగా పోలీసులకు తాజాగా రిపోర్టు అందింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులకు దొరికిన  టిష్యూను డీఎన్‌ఏ టెస్టుకు పంపగా... అవి ఆమె పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్ అయింది. దీంతో  పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. 

రిటైర్డ్ జవాన్ అయిన గురుమూర్తి తన భార్య మాధవిపై అనుమానంతో హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఎముకలు పొడి చేసి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు రోజుల తరువాత గురుమూర్తినే హంతకుడని తేల్చారు.  విచారణలో గురుమూర్తి చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్ అయ్యారు.  తన సర్వీస్ లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.  

బట్టలు తీసి డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్లి

ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న గురుమూర్తికి భార్య మాధవిని చంపేయాలని ప్లాన్ చేశాడు. స్కెచ్ లో భాగంగానే ముందుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచాడు. జనవరి 16వ తేదీన ఉదయం 8 గంటలకు నిద్రలేచి మాధవితో గొడవకు దిగాడు. గొడవ తీవ్రం కావడంతో తలను గోడకేసి బాది చంపేశాడు. మాధవి చనిపోవడంతో ఆమె డెడ్ బాడీని మాయం చేయాలని అనుకున్నాడు. ముందుగా ఆమె బట్టలు తీసి డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్లాడు. కిచెన్‌లో ఉన్న పెద్ద కత్తితో మొదట మొండెం నుంచి తలవేరు చేశాడు. ఆ తర్వాత మాధవి భుజాలను, కాళ్లను కట్ చేశాడు.

ఓ మొద్దుపై వాటిని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని ఓ బకెట్ లో వేసి వాటర్ హీటర్ తో కొన్ని గంటలపాటు వేడిచేశాడు.  ఆ తరువాత వాటిని పెద్ద స్టవ్ మీద బాగా కాల్చాడు.  బాగా కాలిన తరువాత ఎముకలను రోట్లో వేసి దంచి పౌడర్ గా తయారు చేశాడు. ఇందుకు గానూ సుమారుగా 8 గంటల టైమ్ తీసుకున్నాడు. ఆ పౌడర్‌ను ఓ పెయింటింగ్ బకెట్‌లో నింపి ఆ బకెట్‌ను తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. ఇంట్లో ఏ అనావాలు దొరకకుండా డిటర్జెంట్‌తో పాటు ఫినాయిల్‌తో బాగా కడిగాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల్ని తీసుకువచ్చాడని పోలీసులు తెలిపారు.  

Also Read :  ఇంతకీ ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడు?.. అసలు సంగతి ఇది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు