Home Loan EMI Repayments : హోమ్​ లోన్ ని ఇలా కట్టేయండి!

మీరు హోమ్ లోనే తీసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. గృహ రుణం ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి. లేకుంటే ఆర్థికంగా చాలా నష్టపోతారు. అందుకే హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

New Update
Home Loan EMI Repayments : హోమ్​ లోన్ ని ఇలా కట్టేయండి!

Home Loan : మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. కానీ అందరికీ ఆ కలను నెరవేర్చుకునే ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. అందుకే ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి హోమ్‌లోన్స్​పై ఆధారపడుతుంటారు. హోమ్‌లోన్‌ మంజూరు కావడానికి మంచి క్రెడిట్‌స్కోర్‌(Credit Score) తో పాటు, సరైన ధ్రువపత్రాలు ఉండాలి. ఈ గృహ రుణం ప్రక్రియ అంతా పూర్తి అయ్యి, లోన్‌ అప్రూవ్‌ అయ్యాక అతిపెద్ద బాధ్యత మొదలవుతుంది. అదే హోమ్‌లోన్‌ రీపేమెంట్‌. ప్రతినెలా కచ్చితంగా ఈఎంఐ కట్టాలి. ఒకవేళ ఈఎంఐలను సకాలంలో కట్టలేకపోతే, చాలా రకాల సమస్యలు వచ్చిపడతాయి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

EMIలను ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకులు అదనపు ఛార్జీలను విధించవచ్చు. ఈ ఛార్జీలు మీకు భారంగా మారుతాయి. పైగా లోన్‌ రీపేమెంట్‌(Loan Repayment) ప్రక్రియను కష్టతరం చేస్తాయి. అందువల్ల ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి. దీని వల్ల జరిమానాలు, అదనపు రుసుముల నుంచి తప్పించుకోవచ్చు.మీరు చెల్లించే ప్రతి ఈఎంఐతో ఇంటిని సొంతం చేసుకోవడంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తారు. కాలక్రమేణా ఇంటిపై పూర్తి హక్కులను పొందుతారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా ఇంటిని పూర్తిగా సొంతం చేసుకునే మీ లక్ష్యం త్వరగా నెరవేరదు.

EMIలను సకాలంలో చెల్లించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక బాధ్యతలను సకాలంలో నెరవేరుస్తూ, ఇంటిని, క్రెడిట్​ స్కోర్‌ను రక్షించుకుంటూ మనశ్శాంతిగా ఉంటారు. హోమ్‌లోన్‌ గురించి మాత్రమే కాకుండా, జీవితం(Life) లోని ఇతర ముఖ్యమైన అంశాలపై ఫోకస్​ చేయగలగుతారు. గడువులోగా ఈఎంఐ చెల్లించకపోతే ఆర్థిక సమస్యలకు దారి తీయవచ్చు. మీరు అప్పుల్లో కూరుకుపోవచ్చు. బ్యాంకు సిబ్బంది బకాయిలు వసూలు చేయడానికి ఇంటి వద్దకు రావచ్చు. దీనిని కొందరు అవమానకరంగా భావిస్తారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సమయానికి ఈఎంఐలను చెల్లించాలి. అప్పుడే మీ ఆర్థిక స్థితి కాస్త స్థిరంగా ఉంటుంది.సకాలంలో రుణ బకాయిలు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఫలితంగా భవిష్యత్తులో ఇతర రుణాలను తక్కువ వడ్డీ రేటుకే పొందడానికి వీలవుతుంది. ఒకవేళ సకాలంలో ఈఎంఐ చెల్లించలేకపోతే, మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో బ్యాంక్ రుణాలు​ పొందడం చాలా కష్టమవుతుంది.

Also Read : వేసవి సెలవుల్లో విమాన ఛార్జీల మోత మోగుతుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు