మీకు గర్ల్‌ఫ్రెండ్‌ లేదా? ఈ ఏఐ టూల్‌తో మీకు లవర్‌ దొరికేసినట్టే భయ్యా!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలు సృష్టిస్తున్న వేళ .. ఏఐ నుంచి మరో వండర్‌ఫుల్‌ థింగ్‌ అందుబాటులోకి రానుంది. మన ఇష్టాలకు అనుగుణంగా.. ఆర్టిఫిషియల్‌గా ఒక లవర్‌ని క్రియేట్ చేస్తారు. దానితో రోజూ మనం మాట్లాడుకోవచ్చు.. లవర్‌తో ఉన్నట్టే ఉండొచ్చు. సింగిల్‌గా ఉన్నవాళ్లకి ఇది చాలా బెస్ట్ అని కొంతమంది చెబుతుండగా.. మెషీన్‌తో లవ్‌ ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

మీకు గర్ల్‌ఫ్రెండ్‌ లేదా? ఈ ఏఐ టూల్‌తో మీకు లవర్‌ దొరికేసినట్టే భయ్యా!
New Update

చాలా మంది సింగిల్స్‌ తమకు లవర్‌ లేదని తెగ బాధపడిపోతుంటారు. తమ ఫ్రెండ్స్‌కి లవర్స్‌ ఉంటే వారిని చూసి కుళ్లుకునే వాళ్లూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఓ ఏఐ(AI) టూల్‌ని డిజైన్ చేశారు. ఇకపై మీకు లవర్‌ లేదని ఫీల్‌ అవ్వాల్సిన పని లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ద్వారా మీ ఇష్టాలకు అనుగుణంగా మీ లైఫ్‌ పార్ట్‌నర్‌ దొరికే ఛాన్స్‌ ఉంది. AI సహాయంతో మీ ఆదర్శ భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఇప్పుడు మీకు లభించనుంది. అది ఎలాగో చూడండి..!

publive-image ప్రతీకాత్మక చిత్రం

వెతకడం కష్టంగా ఉందా?
అందరికి గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్‌ ఉండాలని రూల్‌ లేదు.. ప్రస్తుత కాలంలో లవ్‌ అన్నది కామన్‌గా మారిపోయినా చాలా మంది సోలో లైఫ్‌లోనే బతుకుతుంటారు. నచ్చిన అమ్మాయి దొరకలేదనో.. తమ ఇష్టాలకు గౌరవం ఇచ్చే అబ్బాయి కనిపించలేదనో సింగిల్‌గా కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం సిలికాన్‌ వ్యాలికి చెందిన ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (Andreessen Horowitz) కంపెనీ ఓ ఏఐ డివైజ్‌ని సృష్టించింది. ఇందులో మన ప్రొఫైల్‌ని రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. మన ఇష్టాఇష్టాలతో పాటు.. లైఫ్‌ పార్ట్‌నర్‌కి సంబంధించి.. లేకపోతే గర్ల్‌ఫ్రెండ్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్ ఎలా ఉండాలన్నదానిపై క్వశ్చన్స్‌కి ఆన్సర్స్‌ ఫిల్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆటోమెటిక్‌గా ఓ ఏఐ లవర్‌ క్రియేట్ అవుతుంది. ఆమె రోజు మనతో మాట్లాడుతుంది. ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. అంటే నచ్చిన అబ్బాయితో మనం రోజు మాట్లాడుకోవచ్చు.. కానీ అది మెషీన్‌ అని మరిచిపోవద్దు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఇది ఎంతవరకు కరెక్ట్ ? :
ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తున్న వేళ ఆండ్రీసెన్ హోరోవిట్జ్ చేసిన క్రియేషన్‌ పట్ల అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు మెషీన్‌తో లవ్‌ ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్ట్ వాదనే.. ఎందుకంటే యంత్రాలు హ్యూమన్‌ ఎమోషన్స్‌ని క్యారీ చేయలేవు. మనుషుల లాగా వాటిలో ఫీలింగ్స్‌ని ఏఐ ద్వారా క్రియేట్ చేసినంత మాత్రానా అవి స్వచ్ఛమైన ప్రేమను ఇవ్వలేవు. మనతో మాట్లాడే వాళ్లు ఎవరూ లేరని.. మిగిలిన వాళ్లు లవర్‌తో మాట్లాడినట్టు మనం కూడా వేరే ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించడం సహజమే కావొచ్చు.. ఇలా ఏఐ లవర్‌తో ఫీలింగ్స్‌ షేర్ చేసుకోవడం మొదట్లో బాగానే అనిపించవచ్చు.. కానీ అది రోజులు పెరిగే కొద్ది మనం ఒక మెషీన్‌తో మాట్లాడుతున్నామన్న విషయం బోధపడుతుంది. అప్పుడు యంత్రంతో కనెక్ట్ అవ్వాలని అనిపించదు. ఇది బయట ప్రపంచంతో కూడా మన సంబంధాలను దూరం చేసే అవకాశాలుంటాయి. ఒకవేళ మనకు రియల్‌గా లైఫ్‌పార్ట్‌నర్‌ దొరికినా.. వారితో కూడా మెషీన్‌తో మాట్లాడినట్టే మాట్లాడితే వాళ్లు హర్ట్ అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. అందుకే ప్రేమ, బాధ లాంటి ఫీలింగ్స్‌ మెషీన్‌తో పంచుకోవడం కరెక్ట్ కాదన్నది చాలా మంది అభిప్రాయం.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe