Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్‌ ఆత్మాహత్య యత్నం

ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్‌ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది.

Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్‌ ఆత్మాహత్య యత్నం
New Update

ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్‌ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది. ప్రిన్సిపల్‌ స్వరూపకు ఓవర్‌ డ్యూటీలు వేయడంతో పాటు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా వివాహితకు ఆరోగ్యం బాగోలేకపోయినా విధులకు రావాలని, లేకుంటే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అటెండర్‌ పాఠశాలలోనే క్రిమి సంహారక ముందు తాగింది. దీనిని గమనించిన టీచర్లు ప్రిన్సిపల్‌కు విషయం తెలియజేయడంతో ప్రిన్సిపల్‌ ఈ విషయం బయట ఎవరికీ చెప్పవద్దని టీచింగ్‌ స్టాఫ్‌తో పాటు, విద్యార్థినులను బెదిరించాడు. అనంతరం స్వరూపను గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్‌ వాహనంలో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వరూప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు సాంఘీక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న బాధితురాలి బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.

స్వరూప ఆత్మహత్య యత్నం చేసుకునేలా చేసిన ప్రిన్స్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. మరోవైపు స్వరూప కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రిన్సిపల్‌ పరారీలో ఉన్నట్లు, అతని గురించి పాఠశాల సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

#harassment #principal #suicide-attempt #mahbubabad-district #inugurthi #attendant #appearance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe