UK Election 2024: బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ (Keir Starmer) బ్రిటన్ కు అతి త్వరలోనే ప్రధాని కాబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునక్ (Rishi Sunak) కన్జర్వేటివ్ పార్టీ చారిత్రాత్మక ఓటమిని సూచించాయి. 650 సీట్ల పార్లమెంట్ లో లేబర్ 410 సీట్లు గెలుచుకుంటుందని పోల్ చూపించింది.
ఇది 14 సంవత్సరాల కన్జర్వేటివ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగింపు పలికింది. సునక్ పార్టీకి 131 సీట్లు మాత్రమే వస్తాయని తెలుస్తుంది. బ్రిటన్ లో జరిగిన గత ఆరు జాతీయ ఎన్నికల్లో 2015 ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే తప్పుగా వచ్చాయి.
హంగ్ పార్లమెంట్ వస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే ఆ సమయంలో కన్జర్వేటివ్ లు మెజారిటీ సాధించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మేలోనే ముందస్తు ఎన్నికలను ప్రకటించారు.
ఓటమికి బాధ్యత వహిస్తున్న..
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ (Conservative Party) ఓటమికి తనదే బాధ్యత అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ భావోద్వేగానికి లోనయ్యారు. ఐ యామ్ సారీ అంటూ పార్టీ మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. సర్ కైర్ స్టార్మర్‌కు నేను కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. నేడు శాంతియుతంగా, క్రమపద్ధతిలో అధికార మార్పడి జరుగుతోంది. ఇరు పక్షాలు తమపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయి. దేశ భవిష్యత్తుకు, సుస్థిరతకు ఇదే భరోసా’’ అని రిషి సునాక్ నార్తర్న్ ఆల్టెర్టన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి వ్యక్తికి సేవ.
లండన్‌లోని లేబర్ పార్టీ (Labour Party)చీఫ్, కాబోయే ప్రధాని స్టార్మర్ ఘన విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఆరంభ ఫలితాల్లో హోల్‌బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ స్థానం నుంచి ఆయన 18,884 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తాను గెలుపొందిన నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ పేర్కొన్నారు.
Also read: భారీ వరదలు.. ఆరుగురు మృతి..29 జిల్లాల్లో 21 లక్షల మంది నిరాశ్రయులు!