UGC: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్తగా 29 స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు.. వివరాలివే.. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది యూజీసీ. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను మరింత పెంచాలనే లక్ష్యంతో కొత్త కొర్సులను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ప్రస్తుత టెక్ యుగానికి అవసరమైన కోర్సులను యూజీసీ తీసుకురానుంది. ఆ కోర్సుల వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి. By Shiva.K 08 Dec 2023 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి UGC Skill Development courses: స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు సంబంధించి యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను మరింత పెంచాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మరికొన్ని కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది యూజీసి (UGC). ఇంటర్ ఉత్తీర్ణత అర్హతతో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా 29 స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టనుంది. గురువారం ఢిల్లీలో యూజీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త కోర్సులకు సంబంధించి పలు మార్గదర్శకాలను విడుదల చేశారు అధికారులు. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీపీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. యూజీపీ ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఇవే.. 👉 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ 👉 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ 👉 డాటా సైన్స్ అండ్ అనలిటిక్స్ 👉 క్లౌడ్ కంప్యూటింగ్ 👉 వర్చువల్ రియాలిటీ 👉 అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ 👉 సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ 👉 5జీ కనెక్టివిటీ 👉 డిజిటల్ ఫ్లూయెన్సీ 👉 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 👉 బేసిక్ కోడింగ్(కంప్యూటర్ లాంగ్వేజెస్) 👉 యోగిక్ సైన్సెస్ 👉 ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ 👉 ఫైనాన్షియల్ టెక్నాలజీ 👉 హెల్త్ అండ్ వెల్‌నెస్ 👉 ఇండస్ట్రీయల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్‌పీఏ) 👉 సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ 👉 ఎలక్ట్రానిక్ సిస్టర్ డిజైన్స్ 👉 కంప్యూటర్ ఎయిడెడ్ డిసైన్(కాడ్) 👉 కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ (కామ్) 👉 మెకానికల్ టూలింగ్ అండ్ ప్రాసెస్ 👉 ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టింగ్ 👉 బేసిక్ 3డీ డిజైన్ 👉 బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మాడలింగ్(బీఐఎమ్) 👉 3డీ ప్రింటింగ్ 👉 ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ 👉 మొబైల్ కమ్యూనికేషన్ అండ్ మొబైల్ రిపేరింగ్ 👉 డిజిటల్ మార్కెటింగ్ 👉 ఫ్యాషన్ టెక్నాలజీ కాగా, యూజీసీ కొత్తగా తీసుకురాబోతున్న ఈ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ను అర్హతగా నిర్ణయించారు. Also Read: ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం #ugc #new-courses #education-courses మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి