Ugadi 2024: ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆనవాయితీ.. అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసా? నేడు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది రోజు పంచాంగం వినడం ఆనవాయితీ. ప్రతీఒక్కరూ తమ ఆదాయ, వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ పంచాంగం ప్రాముఖ్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీపై క్లిక్ చేయండి. By Bhoomi 09 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ugadi Panchangam 2024: ఉగాది అనగానే వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. తెలుగువారి కొత్త ఏడాది ప్రారంభం అయిన మొదటి రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం షురూ కాబోతోంది. ఉగాది రోజు పంచాంగం వినడం తరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ ఆదాయ, వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చోని పంచాంగం వినాలని సిద్ధాంతులు చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశిఫలాలు స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చెబుతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఆ నాలుగు కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజిస్ట్రేషన్లు రద్దు! పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ ఏడాది ఫలితాలను వివరిస్తారు. గత కొంతకాలం వరకు రైతులు తాము పండించే పంటలు ఎలా ఉండనున్నాయి. ఏరువాక ఎలా సాగుతుంది. వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకుంటుండేవారు. అంతేకాదు శుభకార్యాలకు ముహుర్తం పెట్టడం కోసం, పూజాదికార్యక్రమాలు వంటి అనేక విషయాలను తెలుసుకునేందుకు పంచాంగాన్ని ఉపయోగిస్తారు. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి వచ్చి..మళ్లీ కొత్త ఏడాది ముందురోజు వరకు అమల్లో ఉంటుంది. తెలుగు సంవత్సరంలో ఏఏ గ్రహాలకు ఏఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ ఏడాది నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంగములు కలది కాబట్టి పంచాంగం అంటారు. మానవుల జీవితాల కాలంపైన కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉంటుంది. గ్రహాల సంచారంపై జ్యోతిషశాస్త్రం ఆధారపడుతుంది. మనిషి జన్మించింది మొదలు మరణించే వరకు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రం బట్టి జాతక రచన జరుగుతుంది. వీటికి పంచాంగమే ప్రమాణము. ఉగాది రోజు సాయంత్రం దేవాలయాల్లో లేతా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి. జ్యోతిష శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు. కొత్త సంవత్సరంలో తాము తీసుకోవల్సిన లేదా చేయాల్సిన పనుల గురించి తగినట్లు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. #ugadi-2024 #ugadi-pachadi #ugadi #ugadi-panchagam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి