Ugadi Festival: ఉగాది గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

యుగ యుగాల సంధి ఉగాది.. సంస్కృతి, సంప్రదాయం సంద‌డి చేసే ఈ పండగను ప్రజలంతా ఆనందోత్సహాల నడుమ జరుపుకుంటున్నారు. నేడు.. అంటే ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ఉగాది గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

Ugadi Festival: ఉగాది గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
New Update

Ugadi Festival: ఎన్నో కోలాహలాల మధ్య తెలుగు వాళ్ళంతా ఒక్కటై జరుపుకునే ముచ్చటైన పండుగ ఉగాది. ఉగాది అనగనే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడికి చాలా ప్రత్యేకత ఉంటుంది.

Also Read: Basmati Rice : బాస్మతి రైస్ తింటే.. ఇంత మేలు జరుగుతుందా..!

ఉగాది పచ్చడి ప్రత్యేకత

కొత్త వసంతంలోకి అడుగుపెడుతున్న నేపత్యంలో ఏడాది పాటు ఎదురైన మంచి, చెడులు, సుఖ, దుఃఖాలకు సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని సూచిస్తుంది ఉగాది పచ్చడి. జీవితం అనేది 'షడ్రుచుల' సమ్మేళనం అని తెలిపేదే ఉగాది పచ్చడి.

publive-image

ఉగాది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

హిందూ పురాణాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజున సృష్టికర్త బ్రహ్మ ఈ సృష్టిని మొదలు పెట్టారని నమ్ముతారు. శ్రీ మహా విష్ణువు అనేక పేర్లలో యుగాది ఒకటి. విష్ణువును యుగాదికృత్ అని సంభోదిస్తారు. అంటే యుగాల సృష్టికర్త అని అర్ధం. అందుకని ఈ ఉగాది రోజున సృష్టికి మూలకారణమైన బ్రహ్మను ఆరాధించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.

వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు

హిందువులకు ఎంతో శ్రేష్ఠమైన ఈ పండగను తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటారు. అయితే ఈ పండగను ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో పేరుతో పిలుస్తారు. తెలంగాణ, ఆంధ్రలో ఉగాది అని.. మహారాష్ట్రలో- గుడిపాడ్వా , తమిళులు- పుత్తాండు, బెంగాలీలు- పొయ్‌లా బైశాఖ్ , సిక్కులు - వైశాఖీ, మలయాళీలు- విషు అనే పేర్లతో పిలుస్తారు.

publive-image

పురాణాల ప్రాముఖ్యత

మత్స్యావతారంలో వేదాలను దొంగతనం చేసిన సోమకుడిని శ్రీమహావిష్ణువు సంహరించి.. వాటిని బ్రహ్మ దేవుడికి అప్పగించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. అలాగే శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు రాజ్యాధికారం స్వీకరించి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే.

Also Read: Tulsi: తులసి ఆకుల్లో దీన్ని కలిపి రాస్తే .. వద్దన్నా.. జుట్టు పెరుగుతుంది..!

#ugadi-festival
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe