Udayanidhi Stalin: తమిళనాడు మంత్రి(Tamilnadu Minister) , నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా ఆయన మీద హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు కూడా ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటిదని..దాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికీ ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు అయితే ఉదయనిధిని చెప్పుతో కొట్టాలని, తల నరికి తీసుకుని రావాలని కూడా ఆఫర్లు ప్రకటించగా..వాటిని ఎంతో వ్యంగ్యంగా తిప్పికొట్టారు ఉదయ్. బీజేపీ (BJP) నేతలు, హిందూ మత పెద్దలు ఉదయ్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు కూడా.
అయితే ఎవరు ఎన్ని మాటలు అన్న కూడా ఉదయ్ మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. ఎవరు ఎన్ని అన్న నాకు అనవసరం అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నా మీద ఎన్ని కేసులు పెట్టిన సరే దానికి నేను రెడీ అంటున్నారు కూడా. ఇదిలా ఉండగా తాజాగా ఉదయ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
Also Read: ప్రపంచమంతా భారత్‌కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..!
దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్(Mosquito coil)ఫోటోను ఒక దానిని సోషల్ మీడియాలో ఉదయ్ పోస్ట్ చేశాడు. కానీ దానికి ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు. దీనిని చూసిన వారు అందరూ కూడా గతంలో సనాతన ధర్మం (Sanatana Dharma) పై ఉదయ్ చేసిన కామెంట్లను గుర్తుకు తెస్తున్నాయి. దీని గురించి కొంత మంది నెటిజన్లు ఉదయ్ పై వస్తున్న విమర్శలను ఎలా స్వీకరించాలి..ఎలా తిప్పికొట్టాలి అనే విషయం కచ్చితంగా తెలుసని పేర్కొంటున్నారు.
ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దేశం గర్వించే విధంగా జీ 20 సమావేశాలను (G20 Summit) ఏర్పాటు చేశారు బాగానే ఉంది. కానీ దేశంలో ఉన్న పేదల మురికి వాడలను కనపడకుండా కేంద్ర ప్రభుత్వం దాచేసిందని ఆయన విమర్శించారు.
విదేశీ నాయకుల ముందు తమ దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఏర్పాట్లు అని ఆయన అన్నారు. తమిళనాడులో ఉన్న విపక్ష పార్టీ అయిన ఏఐడీఎంకే ఒక పనికి రాని పార్టీ..అది తమిళనాడులో బీజేపీకి చోటు ఇస్తూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.
Also Read: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య