మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింస, అఘాయిత్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉయికేలను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఠాక్రే మాట్లాడుతూ, మహిళను వివస్త్రగా ఊరేగించిన మరో సంఘటన ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. దురదృష్టవశాత్తు, అప్పుడు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. అలాంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉండవచ్చు." ‘దేశానికి మహిళా అధ్యక్షురాలు, మణిపూర్‌కు మహిళా గవర్నర్ ఉన్నారు, కానీ దాని వల్ల ప్రయోజనం లేదు అంటూ వ్యాఖ్యానించారు ఉద్దవ్ ఠాక్రే.
ఒక మహిళగా ఏం చేస్తున్నారు మేడమ్ ప్రెసిడెంట్?
మేడమ్‌ను నేను అభ్యర్థిస్తున్నాను.. మీరు ఒక మహిళగా దేశంలో ఏమి జరుగుతుందో దానిపై మీ పాత్ర ఏమిటి? మేము మన దేశాన్ని భారత్ మాత అని పిలుస్తాము. ఆ తల్లిని అవమానించినట్లయితే..అలాంటి ప్రదర్శన చేస్తుంటే, మేడమ్, మీరు మహిళగా ఏమి చేస్తున్నారు? ప్రస్తుతం పార్లమెంట్‌లో ఈ అంశం రగులుతుండగా, తన జీవితంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఎన్నడూ చూడలేదని స్వయంగా అంగీకరించిన మణిపూర్ గవర్నర్ ఉకేని కూడా థాకరే అదే ప్రశ్న అడిగారు.
క్రూరత్వానికి గురైన మహిళ కార్గిల్ యుద్ధ వీరుడి భార్య అని ఠాక్రే అన్నారు. ఈ ఘటనపై మీరు చూస్తూనే ఉన్నారు... మూడు నెలలుగా ఈ అనాగరికం జరుగుతోంది.. మీ పాత్ర ఏమిటి..?" చిత్రహింసలు, క్రూరత్వానికి గురైన మహిళ కార్గిల్ యుద్ధ వీరుడి భార్య. ఇది మరింత బాధాకరం. కేంద్రం, బీజేపీని ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే.. మణిపూర్ భారత్‌లో భాగమని హెచ్చరించినా ఇప్పుడు అది విడిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక్కడ కూడా 'డబుల్ ఇంజిన్' రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రభుత్వం కూడా విచ్ఛిన్నమైందంటూ వ్యాఖ్యానించారు.
మణిపూర్‌కు ఈడీ లేదా సీబీఐని ఎందుకు పంపడం లేదు:
బీజేపీపై ఘాటుగా స్పందించిన ఠాక్రే, మణిపూర్ కు ఈడీ లేదా సీబీఐని ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలను నియమించడం లేదా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో పేరున్న ఈ ప్రభుత్వం..కేంద్ర ఏజెన్సీలను ఎందుకు పంపించడం లేదని ఫైర్ అయ్యారు.