UdhaynidhiStalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదేలేదు సనాతన ధర్మం గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయినిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టంచేశారు. By BalaMurali Krishna 03 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి సనాతన ధర్మం గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయినిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టంచేశారు. ‘‘సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పాలైన బడుగు, అణగారిన వర్గాల తరుపునే నేను మాట్లాడా. పేరియార్, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులు ఈ అంశంపై లోతైన పరిశోధనలతో పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ తెలిపిందేకు నేను సిద్ధంగా ఉన్నా. నా ప్రసంగంలోకి కీలక భాగాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నా. దోమల కారణంగా కరోనా, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అదే విధంగా సనాతన ధర్మం సామాజిక రుగ్మతలకు దారి తీసింది. న్యాయస్థానంలోనైనా.. ప్రజాకోర్టులో అయినా సరే.. ఎలాంటి సవాల్‌కైనా సరే సిద్ధంగా ఉన్నా. తప్పుడు వార్తల వ్యాప్తిని మానుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 సనాతన ధర్మం నిర్మూలించాలి.. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ రచయితల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కేవలం ప్రతిఘటిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం దోమ లాంటిదని, డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోలుస్తూ వాటిని వ్యతిరేకించలేం.. నిర్మూలించాల్సిదేనని అభిప్రాయపడ్డారు. సనాతన అనేది సంస్కృత పదమని.. సామాజిక, సమానత్వానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు.. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌లో 80 శాతం జనాభా నరమేధానికి ఉదయనిధి పిలుపునిచ్చారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తరచూ ప్రేమ గురించి మాట్లాడతారు కానీ మిత్రపక్షం అయిన డీఎంకే వారసుడు మాత్రం నరమేధానికి పిలుపునిచ్చారని విమర్శించారు. ఇండియా కూటమి తన పేరుకు తగట్టు అవకాశం వస్తే యుగాల నాటి ‘భారత్’ అనే సంస్కృతిని సర్వనాశనం చేస్తుందని ట్వీట్ చేశారు. మరోవైపు ఆయనను అరెస్టు చేసి కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు లాయర్ ఢిల్లీ పోలీసులకు ఉదయనిధి వ్యాఖ్యలపై ఫిర్యాదుచేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి