Tyre Killer Brake: రాంగ్ రూట్ లో వెళుతున్నారా? టైరు పగులుద్ది.. జాగ్రత్త! 

రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎదో టైమ్.. పెట్రోల్ సేవ్ చేసేద్దామని ఆలోచించే వారికీ షాక్ ఇచ్చేలా టైర్ కిల్లర్ బ్రేక్ వచ్చేసింది. అహ్మదాబాద్, రాయ్ పూర్ వంటి నగరాల్లో వీటిని అమర్చారు. ఎవరైనా రాంగ్ రూట్ లో వెళితే ఆ వాహనం టైర్లు పంక్చర్ అయిపోతాయి. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

Tyre Killer Brake: రాంగ్ రూట్ లో వెళుతున్నారా? టైరు పగులుద్ది.. జాగ్రత్త! 
New Update

Tyre Killer Brake: “అరే అటుపక్క వెళ్ళాలి.. యూ టర్న్ చాలా దూరంగా ఉంది.. ఉండు ఎవరైనా కానిస్టేబుల్ ఉన్నారా? ఎవరూలేరు కదా.. అయితే ఓకే,, రాంగ్ రూట్ లో పోదాం..” ఇలా మనలో చాలామంది ఆలోచిస్తారు. ట్రాఫిక్ రూల్స్ తెలిసినా.. అలా రాంగ్ రూట్ లో వెళ్లడం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు అనిపించినా.. అలసత్వం.. మనల్నెవరు ఏమి చేస్తారు లే అనే అదోరకమైన మనస్తత్వంతో రాంగ్ సైడ్ రయ్యిన దూసుకుపోతాం. ఎప్పుడైనా ఏ పోలీసైనా ఓ ఫోటో కొడితే ఐదొందలో.. వెయ్యో ఫైన్ కట్టేస్తాం.. లేకపోతే హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం తప్పుదారిలో. అంతేకదా. 

Tyre Killer Brake: తొందరపాటు వల్ల కొన్నిసార్లు ఖర్చుతో కూడుకున్నదని ఇప్పుడు కొన్ని నగరాల్లో ప్రజలకు బాగా తెలిసి వస్తోంది.  షార్ట్‌కట్‌లను తీసుకోవడానికి, తమ కార్లు -  బైక్‌లను రాంగ్ సైడ్‌లో నడపినవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.  అయితే అలా చేయడం రోడ్డు ప్రమాదాన్ని ఆహ్వానించడం కంటే తక్కువ కాదు అని తెలిసినా నిర్లక్ష్యంగా ఉండేవారి సరదా తీరిపోతోంది ఇప్పుడు. అలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి.. రాంగ్ సైడ్ డ్రైవ్ చేసే వారికి.. ముందు నుంచి వచ్చే వాహనం ఢీకొనే ప్రమాదం ఉందని, ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాల్లో టైర్ కిల్లర్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు.

ఇప్పుడు మీరు టైర్ కిల్లర్ బ్రేకర్ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? టైర్ కిల్లర్ బ్రేకర్ అంటే ఏమిటి? దానిని ఇన్‌స్టాల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే ఈ ప్రశ్నలన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

టైర్ కిల్లర్ బ్రేకర్ అంటే ఏమిటి?

Tyre Killer Brake: టైర్ కిల్లర్ ఒక రకమైన స్పీడ్ బ్రేకర్, కానీ ఇది సాధారణ బ్రేకర్ కాదు. బ్రేకర్ ఒక వైపు పదునైన గోర్లను కలిగి ఉంటుంది.  ఒక వ్యక్తి సరైన దిశ నుండి వస్తున్నట్లయితే అది స్పీడ్ బ్రేకర్‌గా పనిచేస్తుంది. అయితే అదే సమయంలో ఎవరైనా రాంగ్ సైడ్ నుంచి డ్రైవింగ్ చేస్తూ వస్తే, అందులో ఇచ్చిన పదునైన గోర్లు టైర్ పంక్చర్ చేస్తాయి. లేదా పగిలేలా చేస్తాయి. దీని కారణంగా, వాహన యజమాని రెండు లేదా నాలుగు టైర్లు పాడైపోతాయి, అంటే నేరుగా వేల రూపాయల నష్టం అన్నమాట.  దేశంలోని రాయ్‌పూర్, ముంబయి, అహ్మదాబాద్ వంటి అనేక రాష్ట్రాలు రాంగ్ సైడ్ నుండి వచ్చే వ్యక్తులను ఆపడానికి ప్రభుత్వం టైర్ కిల్లర్ బ్రేకర్లను ఏర్పాటు చేశాయి.  టైర్ కిల్లర్ బ్రేకర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వెనుక ప్రభుత్వానికి ఒకే ఒక లక్ష్యం ఉంది. అది  ప్రజలు రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేయకుండా ఆపడం. తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడం. 

Also Read:  ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బే.. డబ్బు.. ఎందుకు.. ఎలా వచ్చింది?

Tyre Killer Brake: చాలా సార్లు రాంగ్ సైడ్ నుంచి వచ్చే వాహనాల వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు ప్రజలు రాంగ్ సైడ్ నడవడం మానేస్తే, దాని వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి, మొదటిది, రాంగ్ సైడ్ నడవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవు.  రెండవది, మీ టైర్ పంక్చర్ అవ్వదు లేదా పగిలిపోదు. అన్నట్టు ఇలాంటిది మన హైదరాబాద్ లోనూ రావడానికి ఎంతో సమయం పట్టదు. అందుకని.. రాంగ్ సైడ్ రయ్యిన పోయేవారు.. కాస్త ఇప్పటి నుంచే సవ్యమైన మార్గంలో వెళ్లడం అలవాటు చేసుకుంటే మంచిది. లేకపోతే, ఎప్పుడో సడన్ గా ఇలాంటి స్పీడ్ బ్రేకర్ పెట్టిన రూట్ లో మీరు అలవాటుగా రాంగ్ సైడ్ లో వెళ్లడం.. మీ టైరుతో పాటు.. జేబు కూడా పగలడం ఖాయం.

#traffic #tyre-breaker
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe