భయంకరంగా మైచౌంగ్ తుఫాన్...ఏపీలో దంచికొడుతున్న వానలు...!!

మైచౌంగ్ తుఫాన్ భయంకరంగా మారింది. అమెరికాలో వచ్చే తుఫాన్లతో పోల్చినట్లయితే ఇది చిన్నదే. అయినప్పటికీ దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

TS Weather : చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!
New Update

Cyclone Michaung : నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మైచౌంగ్ తుఫాన్ కదులుతోంది. గంటకు 13కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి (Machilipatnam)380కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా విస్తరించనుంది. రేపు మధ్యాహ్ననం నెల్లూరు (Nellore) - మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని...ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని డా. బి.ఆర్ అంబేద్కర్ , విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

అటు చిక్కోలు తీరంలో మిఛౌంగ్ (Cyclone Michaung) వాయుగుండం సంకేతాలు కనిపిస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08942_240557. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్. చేపల వేటపై నిషేదాజ్ఞలు, పోలీస్, మెరైన్ పోలీస్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసింది. మైదాన ప్రాంతంలో వరి పంటకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇక తిరుపతిలో (Tirupati) తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. మైచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. పూర్తి సామర్థ్యంతో జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళతో కలకలలాడుతున్నాయి. సామార్థానికి మించి వరద నీరు వచ్చి చేరుతుండటంతో కొన్ని ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో ఘతపతాలీ. కొన్ని ప్రాంతాలకు వర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తిలో పూరి గుడిసె కూలి ఓ చిన్నారి మృతి చెందింది.

ఇది కూడా చదవండి: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్…చాటింగ్ కోసం సీక్రెట్ కోడ్…యాక్సెస్ చేయడం ఎలాగో తెలుసా?

#alert #ap-rains #cyclone-michaung #heavy-rains-in-ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe