World Cancer Day : మెరుగైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.. ఎలాగంటే!

ప్రతి ఏడాది ఫిబ్రవరి 4ను ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఊబకాయం వల్ల రొమ్ము, గాల్ బ్లాడర్, కిడ్నీ, పేగులతో సహా మొత్తం 11 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ గురించి మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
World Cancer Day : మెరుగైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.. ఎలాగంటే!

World Cancer Day 2024 : ఇవాళ(ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం(World Cancer Day). క్యాన్సర్ రావాడానికి ప్రధాన కారణం అవగాహనా రాహిత్యం కూడా. ప్రీ-క్యాన్సర్ లక్షణాలను(Pre-Cancer Symptoms) చాలామంది విస్మరిస్తారు. నోటిలో తెల్లని లేదా ఎర్రటి మచ్చలు, శరీరంలో ఎక్కడో గడ్డలు ఏర్పడి పెరగడం, దీర్ఘకాలిక దగ్గు, నిరంతర మలబద్ధకం సమస్య, ఎక్కువ అలసట, బరువు తగ్గడం లాంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

క్యాన్సర్ లో రకాలు:
అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కంటి, చర్మం, గొంతు, నోరు, పేగు, మూత్రపిండాలు, మూత్రాశయం, గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు మొదలైన క్యాన్సర్లు ఉన్నాయి. భారత్‌లో రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లను గుర్తించడం, స్క్రీనింగ్ చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
జీవనశైలి(Life Style) తో పాటు పర్యావరణ కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయి. నీటిలో పెరిగిన ఆర్సెనిక్ కంటెంట్, పెరిగిన ఫుడ్ పాయిజనింగ్(Food Poisoning)(ఫంగస్ లాంటివి) కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రెండోది ఊబకాయం. ఇక జన్యుపరమైన కారకాలు కూడా కారణమవుతాయి.

వృద్ధాప్యంతో అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండటం సహజం. కొన్ని అధ్యయనాలలో రేడియేషన్ కూడా ప్రమాద కారకంగా పరిగణించబడింది. ఏదేమైనా, ఇది ఒక కచ్చితమైన కారణం అని నిర్ధారించడానికి విస్తృతమైన అధ్యయనాలు ఇంకా అవసరం. రెండడోది అండాశయం, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ కారణాలు ప్రారంభ దశలో తెలియదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

Also Read : పగిలిన మడమలను క్యాండిల్ మైనంతో శుభ్రం చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ఎలా నియంత్రించుకోవాలి:
-->  మద్యం సేవించడం ఏ పరిమాణంలోనూ సురక్షితం కాదు. దాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి.

--> ఎర్ర మాంసం వినియోగం(Red Meat), ధూమపానం(Smoking) నియంత్రించాలి.

--> అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి.

--> ఊబకాయం వల్ల రొమ్ము, గాల్ బ్లాడర్, కిడ్నీ, పేగులతో సహా మొత్తం 11 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

--> బరువు- ఎత్తు నిష్పత్తి(బాడీ మాస్ ఇండెక్స్) 23 దాటితే అది ఊబకాయం.

Also Read: పగిలిన మడమలను క్యాండిల్ మైనంతో శుభ్రం చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు