Retrograde Amnesia: రెట్రోగ్రేడ్ మతిమరుపు గతంలోని జ్ఞాపకాలను ప్రభావితం చేస్తుంది. ఇది మెదడుకు సంబంధించిన సమస్య. దీని వల్ల గతంలో జరిగిన విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. మెదడులో మెమొరీ స్టోరేజ్ భాగాలు దెబ్బతినడం ద్వారా ఈ సమస్యకు ప్రధాన కారణం. రెట్రోగ్రేడ్ మతి మతిమరుపు బ్రెయిన్ లో ఎమోషన్స్ , జ్ఞాపకాలను నియంత్రించే టెంపోరల్, హిప్పోకాంపస్ భాగాలకు నష్టం ప్రభావితం చేస్తాయి. అయితే రెట్రోగ్రేడ్ మతిమరుపుకు అనేక పరిస్థితులు కారణమవుతున్నాయి. అవేంటో తెలుసుకోండి.. మతిమరుపు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది రెట్రోగ్రేడ్, రెండోది యాంటీరోగ్రేడ్.
రెట్రోగ్రేడ్ మతిమరుపు
రెట్రోగ్రేడ్ మతిమరుపు కారణంగా గతంలో ఉన్న జ్ఞాపకాలను కోల్పోతారు. ముందుగా ఇది రీసెంట్ గా జరిగిన సంఘటనలను ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా చిన్న నాటి జ్ఞాపకాలు కూడా మర్చిపోవడం జరుగుతుంది.
అంటెరోగ్రేడ్ స్మృతి
అంటెరోగ్రేడ్ మతిమరుపు లో రోగులు కొత్త జ్ఞాపకాలను ఏర్పర్చుకోలేరు. కానీ ఈ సమస్య ఉన్నవారు గతంలో జరిగిన జ్ఞాపకాలు గుర్తుంటాయి.
Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!
వ్యాధి కారణాలు
పొగ తాగడం, మద్యపానం
అధిక మద్యపానం, పొగ తాగడం మతిమరుపు సమస్యకు కారణమవుతుంది. స్మోకింగ్ మెదడులోని ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది.
నిద్ర లేమి
సరైన, నాణ్యమైన నిద్ర మెదడు పని తీరుకు చాలా ముఖ్యమైనవి. మెదడు చురుకుగా పని చేయాలంటే రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. నిద్ర జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
నిద్ర తక్కువగా లేదా రాత్రిళ్ళు తరచుగా మేల్కోవడం మెదడును డ్యామేజ్ చేసి మతిమరుపుకు దారి తీస్తుంది.
ఒత్తిడి, డిప్రెషన్
ఒత్తిడి, ఆందోళన జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. ఇవి ఏకాగ్రతకు ఆటకం కలిగించి.. జ్ణాపకశక్తి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి హిప్పోకాంపస్ అనే మెమొరీ స్టోరేజ్ క్షీణతకు కారణమవుతుంది.
పోషకాహార లోపం
సరైన మెదడు పని తీరును నిర్వహించడానికి పోషకాహారాలు తీసుకోవడం తప్పనిసరి. నాణ్యమైన ప్రోటీన్స్, ఫ్యాట్స్ చాలా ముఖ్యం. విటమిన్ B12 లోపం జ్ఞాపకశక్తి సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి
తలకు గాయం
తలకు గాయం కూడా మతిమరుపుకు ప్రధాన కారణం. తీవ్రమైన తల గాయాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. స్వల్ప, దీర్ఘ కాలిక జ్ఞాపక శక్తి కోల్పోవడానికి కారణమవుతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Vasthu Tips: ఇంట్లోకి రాగానే ఆందోళనగా అనిపిస్తుందా..? వాస్తు ఏం చెప్తుందో చూడండి