దేశ రాజధానిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆర్‌కే పురం ప్రాంతంలో ఆదివారం జరిగిన కాల్పులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. గుర్తు తెలియని దుండగులు ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడిక్కడే మరణించగా…మరో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించింది. ఈ దారుణ ఘటన ఆర్కే పురం అంబేద్కర్ బస్తీలో చోటుచేసుకుంది. మృతులను పింకీ (30), జ్యోతి (29)గా గుర్తించారు. అయితే వీరిపై దాడికి పాల్పడింది మృతుల సోదరుడేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిమధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చూపట్టారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కారణంగానే మహిళలిద్దరూ హత్యకు గురయ్యారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ ఆర్కేపురంలో దారుణం..ఇద్దరు మహిళలను కాల్చిచంపిన దుండగులు..!!
ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆర్కేపురం అంబేద్కర్ బస్తీలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Translate this News: