NTR District: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు దోనబండ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. పరిటాల క్రషర్స్ వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. బట్టలు ఉతకటానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను లక్ష్మి (15), రాధ (14)గా స్థానికులు గుర్తించారు. ఈ బాలికల కుటుంబాలు 20 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో జీవనం సాగిస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..Crime News: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. ఇద్దరు బాలికలు మృతి..!
ఎన్టీఆర్ జిల్లా పరిటాల శివారు దోనబండ వద్ద విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు
Translate this News: