rains: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..ఎల్లో హెచ్చరికలు జారీ

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా శనివారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

Rain Alert: ఎన్నికల వేళ వాతావరణశాఖ కీలక ప్రకటన!
New Update

గడిచిన రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. అయితే మరోసారి తెలంగాణకు అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది. తెలంగాణలో ఈ వానకాలం వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఎల్లుడి నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయని, రాజస్థాన్‌ నుంచి వెనుతిరుగుతాయని తెలిపింది. ఈ ప్రభావంతో డిసెంబర్‌ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఎల్లో హెచ్చరికలు
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ప్రభుత్వం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అయితే సెప్టెంబర్ 26వ తేదీ వరకు వానలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (సెప్టెంబర్ 22)న ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెం.మీటర్లు, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాన దంచికొట్టగా.. పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.

ఇది కూడా చదవండి:  తెలంగాణలో కల్తీ పాల కలకలం.. ఎలా చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..!

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఏపీలోనూ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పార్వతీపురంమన్యం, అల్లూరి, శ్రీకాకుళం,విజయనగరం, కాకినాడ,ఏలూరు,ఎన్టీఆర్, బాపట్ల,పల్నాడు, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

#hyderabad-meteorological-centre
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe