అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..బాల్టిమోర్‌లో ఇద్దరు మృతి, 28 మందికి గాయాలు..!! అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. గత కొన్నాళ్లుగా తరచుగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అదివారం జరిగిన రెండు వేరువేరు కాల్పుల ఘటల్లో ఇద్దరు మరణించారు. 28మందికి గాయాలయ్యాయి. బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. By Bhoomi 03 Jul 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలో మరోసారి తుపాకీ మోతలు కలకలం రేపాయి. కొద్దికాలంగా కాల్పులు కాస్త తెరిపినచ్చినప్పటికీ ఈ ఘటనలు మళ్లీ జరగడంతో ఆందోళన కలిగిస్తోంది. బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. 28మంది గాయపడ్డారు. బాల్టిమోర్ లో గుర్తుతెలియని వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణ భాగంలోని బ్రూక్లిన్ హోమ్స్ పరిసరాల్లోని బ్రూక్లిన్ డే యానివర్సరీ పార్టీ శనివారం ప్రారంభమైంది. ఈ పార్టీకి వందమంది హాజరయ్యారు. యానివర్సరీ వేడుకలను సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత ఒక్కసారిగా కాల్పులు మోతలు వినిపించాయి. గుర్తుతెలియని వ్యక్తి 30 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అనుమానతుడిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. 19 మంది బాధితులు మెడ్‌స్టార్ హార్బర్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది రోగుల పరిస్థితి నిలకడగా ఉన్న తర్వాత వారిని బాల్టిమోర్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అటు కాన్సాస్ లో జరిగిన మరో ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర వాషింగ్టన్ వీధిలో సీటీ నైట్ క్లబ్ లో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మరో ఇద్దరు తీవ్రగాయపడటంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాల్పులు జరిపిన స్థలంలో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈఘటనకు పాల్పడిన అనుమానుతుడిని ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి