New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/tirumala-cheetah.jpg)
తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్టు దగ్గర రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. చిరుతలను చూసి భక్తులు గట్టిగా కేకలు వేశారు. భక్తుల కేకలతో అడవిలోకి చిరుతలు పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.
తాజా కథనాలు