న్యూయార్క్ లో ఢీకొన్న రెండు బస్సులు...80మందికి గాయాలు..!! న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో నగరంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమదంలో రెండు బస్సుల మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. డబుల్ డెక్కర్ టూర్ బస్సు వెనుక నుంచి మరొక బస్సును ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కొందరు ప్రయాణికులకు తల, మెడ భాగాల్లో తీవ్రగాయలైనట్లు పోలీసులు తెలిపారు. By Bhoomi 07 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 80 మంది గాయపడ్డారు. వారిలో 18 మందికి తీవ్రంగా గాయపడ్డారు. డబుల్ డెక్కర్ టూర్ బస్సు వెనుక నుండి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టింది. దీనితో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. బస్సు వేగంగా ఢీకొనడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మాన్‌హట్టన్‌లో ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారిని బస్సులో నుండి బయటకు తీశారు. డబుల్ డెక్కర్ టూర్ బస్సుకూడా డ్యామేజ్ అయ్యింది. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, రెండు బస్సులు ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయినట్లు తెలిపింది. బస్సులో ఉన్న మరో 63 మందిని వైద్య సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ప్రయాణికుల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరికి ఎముకలు విరగడంతోపాటు తల, మెడపై గాయాలైనట్లు అధికారులు చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి