Guntur: గుంటూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులతో మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే, డాక్టర్లు, మధ్యవర్తి, కిడ్నీ గ్రహిత తనను దారుణంగా మోసం చేశారని.. రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి లక్ష కూడా ఇవ్వలేదని మధుబాబు ఆరోపించాడు. ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు కిడ్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తనకు న్యాయం కావాలని అధికారులను ఆశ్రయించారు.
Also Read: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రకుల్ సోదరుడికి పాజిటివ్!
తాజాగా, కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు భాషా, సుబ్రమణ్యంను అరెస్ట్ చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు. ఈ కేసులో ఇద్దరి విచారణ పూర్తయిందని..న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు. కిడ్నీ రాకెట్ కేసులో తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. కేసు దర్యాప్తులో ఉందని.. మిగతా వివరాలు విచారణలో బయటపడతాయని వ్యాఖ్యానించారు.