ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి దారుణ హత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్..!!

ఢిల్లీలో యూనివర్సిటీకి చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన ఆర్యభట్ట కాలేజీలో మృతుడు బీఏ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. నలుగురు సభ్యులు గల గ్యాంగ్ నిఖిల్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ చికిత్స పొందుతూ మరణించాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

New Update
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి దారుణ హత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్..!!

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి హత్య కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థి నిఖిల్ చౌహన్ బీఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిఖిల్ ఆదివారం మధ్యాహ్నం హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిఖిల్ పై ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో నలుగురు సభ్యుల గ్యాంగ్ దాడికి పాల్పడింది. నిఖిల్ పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న నిఖిల్ ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు.

delhi university murder case

ఈ కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరు 19 ఏళ్ల రాహుల్, ఆర్యభట్ట కాలేజీలోనే బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి బిందాపూర్‌లో బ్రెడ్ ,చీజ్ దుకాణం నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రెండో నిందితుడు జనక్‌పురి నివాసి హరూన్ (19). హరూన్ స్కూల్ డ్రాపౌట్ రాహుల్ స్నేహితుడు. హరూన్ నీలోతి ప్రాంతంలోని టీ-షర్ట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరు నిందితులను గుర్తించారు.

కాగా నిఖిల్ హత్యకు వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటనే కారణమని పోలీసులు తెలిపారు. మృతుడు నిఖిల్ తన ప్రియురాలితో ఉండగా..నలుగురు నిందితుల్లో ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో నిఖిల్ ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే నిఖిల్ పై కోపం పెంచుకున్న నిందితుడు తన స్నేహితులతో కలిసి నిఖిల్ పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు