ట్విట్టర్‌కు ఝలక్..రూ. 50లక్షల ఫైన్ వేసిన కర్నాటక హైకోర్టు..!! ట్విట్టర్‌కు షాకిచ్చింది కర్నాటక హైకోర్టు. ట్విట్టర్ వేసిన పిటిషన్ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. ట్వీట్లు, అకౌంట్లను బ్లాకే చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిసతూ..ట్విట్టర్ హైకోర్టులో దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. ట్విట్టర్ సంస్థకు లీగర్ ఖర్చుల కింద రూ. 50లక్షల ఫైన్ విధించింది. By Bhoomi 30 Jun 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది కర్నాటక హైకోర్టు. కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 2021నుంచి 2022 మధ్య కేంద్రం ప్రభుత్వం పదిసార్లు ట్వీట్లను బ్లాక్ చేయాలంటూ ఆదేశించిందని ట్విట్టర్ సంస్థ వేసిన పిటిషన్ను కర్నాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మరో 30 యూఆర్ఎల్స్ ను కూడా తీసివేయాలని కేంద్ర ఐటీశాఖను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను తప్పుపడుతూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ కృష్ణ దీక్షిత కొట్టేశారు. అంతేకాదు ఆ సంస్థపై రూ. 50లక్షల జరిమానా కూడా విధించారు. ఈ 50లక్షలను 45 రోజుల్లోగా కర్నాటక రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. సకాలంలో అడ్డుకోవాలన్న కేంద్రం డిమాండ్లను పాటించకపోవడానికి కారణాలు చెప్పలేదని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ అన్నారు. తీర్పులోని ఆపరేటివ్ భాగాలను ప్రస్తావిస్తూ, కేవలం ట్వీట్‌లను మాత్రమే కాకుండా ఖాతాలను కూడా బ్లాక్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తాను నమ్ముతున్నానని జస్టిస్ దీక్షిత్ అన్నారు. ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానా : ఫిబ్రవరి 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య 39 URLలను తీసివేయడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 10 ఆదేశాలను సవాలు చేస్తూ ట్విట్టర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్‌లో కర్నాటక హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. దీనిపై ఈరోజు తీర్పు వెలువరిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్‌కు రూ. 50 లక్షల జరిమానా విధించామని, దానిని 45 రోజుల్లోగా కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, బెంగళూరుకు చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. ఈ మొత్తాన్ని ఇవ్వడంలో జాప్యం జరిగితే, రోజుకు రూ. 5,000 అదనపు రుసుమును చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విట్టర్ ఏం చెప్పింది? సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడానికి సాధారణ ఉత్తర్వులు జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని, వినియోగదారులకు తెలియజేసిన కారణాలను ఆర్డర్‌లు కలిగి ఉండాలని ట్విట్టర్ ఈ విషయంలో వాదించింది. భారత సార్వభౌమాధికారం లేదా ప్రజా స్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం కోర్టు ముందు వాదించింది. సీల్డ్ కవరు వినియోగాన్ని నిషేధించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కూడా హైకోర్టుకు సమర్పించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి