TV Subscription: హాయిగా హాలులో కూచుని.. టీవీ పెట్టుకుని.. TVలో వచ్చే సినిమానో.. క్రికెట్టో చూస్తూ సండే ఎంజాయ్ చేస్తున్నారా? చేయండి చేయండి.. వచ్చేనెల నుంచి ఆ ఓటీటీ బిల్లు చూసి కళ్ళు తేలవేద్దురు. అవును.. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా అలాగే వయాకామ్ 18 వంటి ప్రధాన ప్రసార సంస్థలు టీవీ ఛానెల్‌ల నెలవారీ ప్యాక్‌ల ధరలను పెంచబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు ఓటీటీలో సినిమాలు.. వెబ్ సిరీస్ లు చూసి ఎంజాయ్ చేయాలంటే.. నెలవారీ ప్యాక్ కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, అధిక కంటెంట్ ధర కారణంగా, బ్రాడ్‌కాస్టర్లు దానిని భర్తీ చేయడానికి (TV Subscription)ధరలను పెంచాలని నిర్ణయించుకున్నారు. కొత్త ధర ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
Network18 - Viacom18 డిస్ట్రిబ్యూటర్ బ్రాంచ్ అయిన IndiaCast తన పోర్ట్‌ఫోలియోకు క్రీడలకు సంబంధించిన కంటెంట్ పెద్ద ఎత్తున జోడించింది. దీని ఆధారంగా కంపెనీ తన ప్యాక్‌ల ధర(TV Subscription)ను 20-25% పెంచింది. జీ తన నెలవారీ ప్యాక్‌ల ధరలను 9-10% కంటే ఎక్కువ పెంచగా, సోనీ ప్యాక్‌ల ధరలు 10-11% పెరిగాయి. డిస్నీ స్టార్ తన కొత్త ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, పెరిగిన ధరల కారణంగా వినియోగదారులు కోపం తెచ్చుకోకుండా చూసేందుకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) బ్రాడ్‌కాస్టర్ రేట్ కార్డ్‌ను పర్యవేక్షిస్తోంది. కొత్త టారిఫ్ ఆర్డర్ (NTO) 3.0కి అనుగుణంగా బ్రాడ్‌కాస్టర్ ప్యాక్‌లను రెగ్యులేటర్ పరిశీలిస్తుందని TRAI వర్గాలు అంటున్నాయి.
Also Read: ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు.
రెండోసారి పెరిగిన ధర..
నవంబర్ 2022లో TRAI ద్వారా NTO 3.0 అమలులోకి వచ్చిన తర్వాత బ్రాడ్‌కాస్టర్‌లు తమ ప్యాక్ ధరల(TV Subscription)ను రెండవసారి పెంచారు. NTO 2.0 అమలులో ప్రతిష్టంభన కారణంగా, TV ఛానెల్ ధరలు ఫిబ్రవరి 2023కి ముందు దాదాపు మూడు సంవత్సరాల పాటు మార్పులు లేకుండా ఉన్నాయి. బ్రాడ్‌కాస్టర్‌లు- కేబుల్ టీవీ కంపెనీల మధ్య వివాదం కారణంగా ఫిబ్రవరి 2023లో ధరల పెరుగుదల జరిగింది. ఫలితంగా, ప్రసారకర్తలు కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ సిగ్నల్‌లను స్విచ్ ఆఫ్ చేశారు.
ప్యాక్‌లు ఖరీదైనవి కావడానికి కారణం ఇదే..
బ్రాడ్‌కాస్టర్‌లు తమ ఛానెల్‌ల కోసం లా కార్టే - ప్యాక్ ధరలు(TV Subscription) రెండింటినీ ప్రకటించాలి. అయితే, చాలా మంది వినియోగదారులు ఖర్చులను ఆదా చేయడానికి ప్యాక్‌లను ఇష్టపడతారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) డిజిటల్ హక్కులు, బిసిసిఐ మీడియా హక్కులు, క్రికెట్ సౌత్ ఆఫ్రికా మీడియా హక్కులు, ఒలింపిక్స్ 2024 వంటి స్పోర్ట్స్ రైట్స్‌లో రూ. 34,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం వల్ల వయాకామ్ 18 వాల్యుయేషన్ పెంపుకు కారణమని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. Viacom18 BCCIతో అనుబంధం కారణంగా సబ్‌స్క్రిప్షన్ రాబడిలో రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ద్రవ్యోల్బణం కారణంగా సోనీ, జీ ఈ ధరలు పెంచే పని చేశాయి.
Watch this interesting Video: