TV Anchor : దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మధ్య నమోదు అవతున్నాయి. దీంతో జనం ఇళ్లనుంచిబయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోత, వడగాలులతో సతమతం అవుతున్నారు. సాయంత్రం 6 దాటుతేనే కాస్తంత చల్లగా ఉంటుంది.ఈ క్రమంలోనే దూరదర్శన్ ఛానెల్ కు చెందిన ఓ మహిళా యాంకర్ ఎండ వేడిమికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. వార్తలు చదువుతుండగానే కుర్చిలో స్పృహతప్పి పడిపోయింది. ఈ ఘటన దూరదర్శన్ కోల్ కతా బ్రాంచిలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే...దూరదర్శన్ కోల్ కతా బ్రాంచిలో లోపముద్ర అనే యాంకర్ వాతావరణం కు సంబంధించిన వార్తలను చదువుతోంది. న్యూస్ చదువుతూనే ఆమె కళ్లు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలింది. ఇది గమనించిన స్టూడియో సిబ్బంది వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. దాంతో ఆమె స్పృహలోకి వచ్చింది. ఎండలు మండిపోతున్నాయని...స్టూడియోలో కూలింగ్ సిస్టమ్ ఉన్నాకూడా వేడిగా ఉందని యాంకర్ చెప్పారు. ఒక్కసారిగా తనకు కళ్లుమూత పడ్డాయని..మసకబారుతూ టెలి ప్రాంప్టర్ కనిపించలేదన్నారు. డీహైడ్రేషన్ కారణంగా బీపీ లేవల్స్ పడిపోవడమే అందుకు కారణమై ఉంటుందన్నారు.
కాగా తన 21ఏండ్ల కెరీర్ లో 15 నిమిషాలు, అరగంట నిడివిగల బులెటిన్స్ ఎన్నో చదివానని, ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. బులెటిన్ మధ్యలో ఏనాడు నేను నీళ్లు తాగలేదని..స్టూడియోలో వార్తలు చదివేటప్పుడు పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకునే అవసరం ఎప్పుడూ రాలేదన్నారు. విపరీతమైన ఎండల కారణంగానే తాను సొమ్మసిల్లి పడిపోయానని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కాషాయ పాలకుల కుట్ర..!