Vastu Tips: తాబేలు అంటే మనందరికీ తెలుసు. చిన్నప్పుడు దీని గురించి కథలు విని ఉన్నాము. అయితే ఇవీ ఎక్కువగా కాలవల్లో, బావిల్లో ఉంటాయి. అంతేకాకుండా దేవాలయాల్లో తాబేలు బొమ్మలు కూడా పెడుతూ ఉంటారు. అలా పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉందట. తాబేలుని చూడటం వల్ల మనకి మంచి జరుగుతుందని.. శుభప్రదంగా కూడా చెబుతారట. అందుకని పూర్వకాలంలో కూడా నూతిలో తాబేలును ఉంచేవాళ్ళు. అయితే ఇంట్లో తాబేలు ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే మంచిదేనా:
ఇంట్లో తాబేలు కానీ తాబేలు బొమ్మ ఉంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. నిజానికే తాబేలు ప్రతి ఇంటిలో ఉండాలి. ప్రతి దేవాలయంలో తాబేలు బోమ్మ ఉంటుంది. ఎందుకు తాబేలుని ఉంచుతారో చాలామందికి తెలియదు. దీనిని చూడటం వల్ల మనకు మంగళ దర్శనం కలుగుతుందట. అంతేకాకుండా తాబేలు వంక చూస్తే ఎంతో అదృష్టం అంట. అందుకని ఇంట్లో తాబేలు లేకపోయినా కనీసం తాబేలు బొమ్మ పెట్టుకుంటే మంచిదట. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కూడా కలిగి మనకు మంచి జరుగుతుందట. అందుకని తాబేలను మంగళప్రదం అని చెబుతూ ఉంటారు. అందుకే పూర్వకాలంలో కూడా దీనిని ఇంట్లో ఉంచుకునే వాళ్లంట. అందుకే దేవాలయాల్లో ఈ బొమ్మని పెడుతూ ఉంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి!