Karnataka: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది. షిమోగలో వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు వివరించారు.
తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వదర ప్రవాహం కొనసాగుతుందని సమాచారం.
వరద ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు.
Also Read: కార్ల వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం..16 కార్లు దగ్ధం!