Tummala: కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక ఖాయం.. సోనియా సమక్షంలో కండువా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా పవర్‌ చేపట్టాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి.

New Update
Tummala: కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక ఖాయం.. సోనియా సమక్షంలో కండువా

Tummala: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా పవర్‌ చేపట్టాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలో ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకోవడం ఖాయమైపోయింది.

తుమ్మలతో కాంగ్రెస్ పెద్దలు భేటీ..

త్వరలో హైదరాబాద్‌లో జరిగే సీడబ్యూసీ సమావేశంల జరగనుంది. అంతేకాకుండా ఆదివారం భారీ బహిరంగ సభ కూడా ఉండనుంది. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ తరలి రానున్నారు. వారి సమక్షంలోనే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తుమ్మల నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. తుమ్మలతో పార్టీలో చేరిక పైన తీవ్రంగా చర్చించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకు తుమ్మల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 17న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది.

పాలేరు నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్..

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మలకు సీఎం కేసీఆర్ స్థానం కల్పించలేదు. పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన తుమ్మల.. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు, అనుచరులు అభిప్రాయాలు తీసుకుని కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పాలేరు నుంచి సీటు విషయంలో సరైన హామీ రాకపోవడంతో తుమ్మల చేరిక ఆలస్యమైంది. ఇప్పుడు హస్తం పెద్దలు హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి: ఇది ప్రజల జిల్లా దొరల జిల్లా కాదు.. భట్టి కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు