Tummala: తుమ్మల చేరికపై ఉత్కంఠ.. రహస్యంగా కాంగ్రెస్ మంతనాలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా ఉంటున్నాయి. తాజాగా తుమ్మల ఎన్నికల పోటీ హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే తేల్చి చెప్పిన తుమ్మల.. ఏం పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది..రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోకి వెళ్తారా?.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? అనేది తుమ్మల ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. By Vijaya Nimma 27 Aug 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి ఏ పార్టీలో చేరుతారో..? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల చెప్పడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలకు బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ప్రకటించిన జాబితాలో పేరు లేకపోవడంతో కార్యకర్తలు, అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. దీంతో తుమ్మల అనుచరులు, నియోజకవర్గంలో పోటీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అవసరమైతే పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానైనా పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తుమ్మల పోటీ చేస్తాను అన్నారు.. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది ఈ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గెలిపించుకుంటామని భరోసా ఈ నేపథ్యంలోనే తుమ్మల ఇంటికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. గండుగులపల్లిలోని తుమ్మల నివాసానికి వెళ్లి మరి పరామర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక ప్రచారంతో ముందస్తుగా వెళ్లి పలువురు నేతలు కలుస్తున్నారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే యోచనలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. ప్రజాక్షేత్రంలో తుమ్మల ఉండాల్సిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగితే గెలిపించుకుంటామని వారు భరోసా ఇస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్‌లో చేరికపై ఇప్పుడు జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రహస్యంగా వెళ్లి తుమ్మలను కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కలుస్తున్నారు. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తాం.. పాలేరు టికెట్ తుమ్మలకు సీఎం కేసీఆర్ ప్రకటించలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు తుమ్మలను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఫలించకుండా పోయింది. అయితే నిన్న హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళిన తుమ్మలకు ఘనస్వాగతం పలికారు ఆయన అనుచరులు. కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ చేశారు. ప్రజలు, అభిమానుల ఆదరణ చూసి తుమ్మల కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఎప్పుడూ ఆసక్తిగా ఉంది. అయితే కాంగ్రెస్‌లోనే చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని ఇప్పటికే సీనియర్ నేత రేణుక చౌదరి చెప్పిన విషయం తెలిసింది. అంతేకాకుండా బీజేపీలోకి కూడా తుమ్మలను చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. #tummala #congress-talks-in-secret #congress-leaders-house-in-tummala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి