Tomatoes Thulabharam: టమాటాలతో తులాభారం.. ఆ క్రేజ్ అలాంటిది మరి

కొంతకాలంగా టమాటా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పెరిగిన ధరలతో టమాటాలు కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. ప్రస్తుతం కేజీ రూ.150 వరకు పలుకుతోంది. అంతేకాదు రానున్న రోజుల్లో రూ.300 అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో టమాటాల వైపు చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

New Update
Tomatoes Thulabharam: టమాటాలతో తులాభారం.. ఆ క్రేజ్ అలాంటిది మరి

publive-image

తులాభారం చూసేందుకు ఎగబడిన జనం.. 

ప్రస్తుతం టమాటాలు కొనేవారే డబ్బున్నోళ్లు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారీగా పెరిగిన ధరలతో టమాటాలు కొని కూరల్లో వాడాలంటే సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. అలాంటిది ఓ వ్యక్తి తన కూతురికి ఏకంగా టమాటాలతో తులాభారం నిర్వహించిన ఘటన వైరల్ అవుతోంది. సాధారణంగా తులాభారం అంటే బంగారం, డబ్బుతోనో నిర్వహిస్తుంటారు. కానీ అనకాపల్లికి చెందిన జగ్గ అప్పారావు దంపతులు తమ కూతురు భవిష్యకి స్థానిక నూకాలమ్మ ఆలయంలో 51 కేజీల టమాటాలు, బెల్లం, పంచదారతో కలిపి తులాభారం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. టమాటాలతో తులాభారం వేసిన ఘటనను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇలా టమాటాలతో కూడా తులాభారం వేస్తారా? అంటూ ఆశ్చర్యయారు. అనంతరం టమాటాలు, బెల్లం, పంచదారను ఆలయంలోని నిత్య అన్నదానంకు విరాళంగా ఇచ్చారు.

చిత్రవిచిత్ర ఘటనలు చేయిస్తున్న టమాటా..

టమాటా ధరలు పెరుగుదలతో వింత వింత ఘటనలు చూస్తూనే ఉన్నాం. టమాటాలకు కాపలాగా బౌన్సర్లు పెట్టుకోవడం.. సీసీ కెమెరాలు పెట్టడం.. వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల భార్యాభర్తలు విడిపోవడం, దొంగతనం వంటివి కూడా జరిగాయి. మరోవైపు మొన్నటిదాకా నష్టాల్లో ఉన్న టమాటా రైతులు ప్రస్తుతం కోటీశ్వరులు అవుతున్నారు. తమ పొలాల్లో సాగుచేసిన పంటను అధిక ధరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. దీంతో డబ్బుల కొసం కొంతమంది దుండగులు వారిని టార్గెట్ చేస్తూ ప్రాణాలు కూడా తీస్తున్నారు.

ఎలా బతకాలంటున్న సామాన్యులు..

ఇలాంటి ఘటనే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన సంగతి తెలిసిందే. బోడుమల్లదిన్నె గ్రామంలో టమాటాల రైతు రాజశేఖరరెడ్డిని దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటన మర్చిపోకముందే ఇదే జిల్లాలోని పెద్దతిప్పసముద్రం గ్రామానికి చెందిన మధుకరరెడ్డి టమాటా సాగుకు కాపలాగా ఉన్నాడు. అయితే దుండగులు రైతును చంపేసి టమాటాలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి కూడా దొంగతనంగా టమాటాలను స్మగ్లింగ్ చేస్తున్నారు. టమాటా ధరలు ఇంకా పెరిగితే ఇంకెన్ని దారుణాలు చూడాలో మరి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టమాటా మనుషుల జీవితాలతో ఓ ఆట ఆడుకుంటుంది. అటు మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో బతుకుబండి ఎలా నెట్టుకురావాలని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు