BJP Politics: టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకుంటారా?: దొరలపై పోరాటం ఆపను: తుల ఉమ

వేములవాడ టికెట్ ను మార్చడంపై తుల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళ అయిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు.

BJP Politics: టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకుంటారా?: దొరలపై పోరాటం ఆపను: తుల ఉమ
New Update

వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ పేరు మార్చడంతో తుల ఉమ (Tula Uma) కంటతడి పెట్టారు. బీసీ బిడ్డ, మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కచ్చితంగా పోటీలో ఉండి కొట్లడుతానని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేస్తే తప్పు.. ప్రజా నాయకురాలిగా ఎదగడం తప్పు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ ఎలాంటి హాని చేయలేదన్నారు. 75 ఏళ్లుగా వేములవాడలో దొరల పెత్తానం నడుస్తోందన్నారు. ఆనాడు దొరల బానిసత్వం విముక్తి పై కోట్లాడిన వాస్తవమేనని.. ఇప్పుడు కూడా ఇక కోట్లాడుతానన్నారు. ఇక వేములవాడ నుంచే దొరలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. వేములవాడ దొరల ప్రాంతం, వేరే వారికి అవకాశము ఇవ్వరా? అని ప్రశ్నించారు. తనకు టికెట్ పై ఇంకా నమ్మకం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Mandula Samuel: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 పర్సంట్ రిజర్వేషన్ కోసం చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఆచరణలో కనీసం 10-12 శాతం అమలు కావడం లేదన్నారు. గోర్లు కాసుకునే వారు ఎమ్మెల్యే కావొద్దా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తుల ఉమ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది.

తుల ఉమకే టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి ఈటల రాజేందర్ పట్టుబడుతున్నారు. ఆయన ఒత్తిడితోనే మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బండి సంజయ్ మాటను కూడా పక్కకు పెట్టి తుల ఉమకు టికెట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్. కానీ ఆఖరి నిమిషంలో పేరు మార్చింది. ఈంతో ఈ పరిణామాలు ఈటలకు కూడా ఇబ్బందికరంగా మారాయి.

#telangana-elections-2023 #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe