శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..వసతి కోటా బుకింగ్‌ ఎప్పుడంటే..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోట్లాది మంది కోరుకుంటూ ఉంటారు. శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అక్టోబర్‌కు సంబంధించిన తిరుమల, తిరుపతి వసతి కోటాను ఇవాళ విడుదల చేయనుంది.

New Update
శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..వసతి కోటా బుకింగ్‌ ఎప్పుడంటే..?

publive-image image credit/TTD

శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇవాళ(జులై 26) ఉదయం 10గంటలకు అక్టోబర్‌కు సంబంధించిన తిరుమల, తిరుపతి వసతి కోటా విడుదల చేయనుంది. ఒక మొబైల్ నెంబర్‌తో ఒక రూమ్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది. రెండో రోజుకి ఎక్స్‌టెన్షన్ ఇస్తారు. ఇద్దరి పేర్లు మాత్రమే రూమ్ బుక్ చేసినప్పుడు ఎంటర్ చేయాలి. తిరుమల రూమ్‌ బుకింగ్‌కి వంద రూపాయలు, వెయ్యి రూపాయలు, 1,500రూపాయలు స్లాట్స్ మాత్రమే ఉంటాయి. వంద రూపాయలు రూమ్ బుక్ చేయాలనుకుంటే వంద రూపాయలతో పాటు డిపాజిట్ కింద 500 రూపాయలు కట్టించుకుంటారు. మరోవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంది.. వర్షాలను సైతం లెక్క చేయకుండా భారీగా భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు