మరోసారి చిరుత కలకలం.. తిరుమలలో భక్తుల ఆందోళన

తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో దర్శనానికి వెళ్తున్న భక్తుల్లో కలవరం మొదలైంది. చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్టయ్యారు.

New Update
మరోసారి చిరుత కలకలం.. తిరుమలలో భక్తుల ఆందోళన

Tirumala: తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో దర్శనానికి వెళ్తున్న భక్తుల్లో కలవరం మొదలైంది. చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్టయ్యారు. భక్తులను అప్రమత్తం చేశారు. పలు జాగ్రత్తలు సూచిస్తూ హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: షాకిచ్చిన సఫారీలు.. రెండో వన్డేలో చిత్తయిన టీమిండియా

అలిపిరి నడక మార్గంలో గుంపులుగానే వెళ్లాలని సూచించారు. నడకదారి భక్తులను గుంపులుగానే అనుమతిస్తున్నారు. నరసింహ స్వామి ఆలయ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. వారం క్రితం కూడా ఇక్కడే టీటీడీ అధికారులు అది తిరుగుతుండడాన్ని గుర్తించారు.

ఇది కూడా చదవండి: సరిగా నిద్రపోవడం లేదా? క్యాన్సర్‌ను ఏరికోరి తెచ్చుకున్నట్లే..!

గతంలో ఓ బాలుడిపై దాడి, ఆ తర్వాత చిన్నారిని చిరుత చంపేయడం భక్తుల్లో తీవ్ర భయాందోళనలు కలుగజేసింది. టీటీడీ, అటవీ అధికారులు ఉమ్మడి ఆపరేషన్‌తో కొన్ని చిరుతలను బంధించారు. అయితే, తాజాగా తిరుమలలో మళ్లీ చిరుత సంచరిస్తుండడాన్ని అధికారులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు