TTD New Board Committe: టీటీడీ కార్యవర్గ నియామకానికి రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.
టీటీడీకి కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి 10వతేదీన (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిని స్వీకరించటం రెండోసారి.
2006లో తొలిసారిగా ఈ పదవిని చేపట్టి రెండేళ్లపాటు నిర్వహించారు. ఇప్పుడు ఛైర్మన్ నియామకం పూర్తి కావటంతో ప్రభుత్వం కార్యవర్గ సభ్యుల నియామకంపై దృష్టిపెట్టింది.
కోటా మేరకు నియామకాలు
టీటీడీ కార్గవర్గంలో ప్రధాని మోదీ కోటాలో ఒకరు,అమిత్‌షా కోటలో ఇద్దరు,ఏపీ గవర్నర్ కోటాలో ఒకరు, తెలంగాణ సీఎం కేసీఆర్ కోటాలో ఇద్దరు, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కోటాలో ఇద్దరి వంతున ఆర్గురు .. మొత్తం 12 మందిని ఎంపికచేస్తారు. బోర్డులో ఎంత మంది కార్యవర్గ సభ్యులను నియమించాలనే అంశం ప్రభుత్వ నిర్ణయంపైన ఆధారపడుతుంది. ఇంతకు ముందు టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన వై.వి.సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో 26 మంది కార్యవర్గ సభ్యులు ఉండేవారు.
ఎక్స్అఫీషియో సభ్యులుగా మరికొంత మంది..
టీటీడీ పాలకవర్గంలో కార్యవర్గ సభ్యులతో పాటు, మరికొంత మందిని ఎక్స్ఆఫీషియో సభ్యులుగా నియమిస్తారు. ఎమ్మెల్యే కోటా నుంచి కూడా
కొంత మందిని కార్యవర్గంలోకి తీసుకుంటారు. ఏపీనుంచి ప్రస్తుతం ముగ్గురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంచి వాగ్ధాటి ఉన్న నేత ఒకరిని ఎంపిక
చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ సమీకరణాలను బట్టి ప్రభుత్వ ఎంపిక సాగుతుంది. పాలకవర్గంలో ఎవరెవరు ఉంటారనేది తేలాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడవలసిందే.