TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భక్తులకు భయం లేదు

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. కానీ ఈ కంచేను ఎంత దూరం ఏర్పాటు చేస్తారనేది సందిగ్ధంగా మారింది.

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భక్తులకు భయం లేదు
New Update

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల అడవీ ప్రాంతంలో చిరుతల కలకలం రేగుతోంది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో ఉన్న నరసింహా స్వామి ఆలయం వద్ద చిరుత చిన్నారిపై దాడి చేసి చంపింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చడంతో ఒక్కటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో చిరుతలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆపరేషన్‌ చిరుతను ప్రారంభించారు. ఇప్పటి వరకు 5 చిరుతలను బంధించినట్లు తెలిపారు.

మరోవైపు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు చెతి కర్రలను ఆందించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిరుత సంతరిస్తుండటంతో చిన్న పిల్లలతో నడక మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకునేందు వచ్చే వారిని మధ్యాహ్నం 2 గంటల లోపే అనుమతిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నడక మార్గంలో వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సీసీపుటేజీలో చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నడక మార్గంలో కంచెను నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ కంచెను పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుందా లేక అలిపిరి నుంచి కొండ వరకు నిర్మించాలని నిర్ణయం తీసుకుందా అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది.

అంతే కాకుండా ఇప్పటి వరకు 5 చిరుతలను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది.. చిరుతల కోసం వేట కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కొండ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి కొండపై ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలతో పాటు ఇతర జంతువులు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ తాము చిరుతల కోసమే ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయమని, నడక మార్గంలో టీటీడీ సిబ్బంది ఉంటారని, వారు భక్తులకు ధైర్యం చెబుతారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: తిరుమలలో మరోసారి విమానం హల్‌చల్‌

#walkway #alipiri #protection #ttd #fencing
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe