TTD EX Board Member OV. Ramana: తాజా రాజకీయాలపై సిగ్గు వేస్తోందని మాజీ టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి నేత ఓ.వి.రమణ అసహనం వ్యక్తం చేశారు. కాపు, బలిజ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో బలిజలను రాజకీయంగా పాతాళానికి తొక్కారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కాపు, బలిజలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంచిపరిణామం
ఈ క్రమంలోనే టిడిపి, జనసేన ఉమ్మడి కూటమిపై ముద్రగడ ఆలోచించడం మంచిపరిణామం అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఆయన తెలుసుకున్నారని కామెంట్స్ చేశారు. కులం, మతం చూడమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ప్రత్యర్థులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలి, అక్రమంగా ఎలా దోచుకోవాలనే అంశాలపైనే దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు.
Also Read: చింతమనేని వద్దు – ఎవరైనా ముద్దు.. తేల్చి చెబుతున్న టిడిపి-జనసైనికులు
అక్రమ కేసులే అభివృద్దా?
చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ లపై చులకనగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును జైలులో పెట్టడం, లోకేష్ పై అక్రమ కేసులు పెట్టడమే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటూ ఎద్దేవా చేశారు. చిన్న పిల్లల ముందు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలకు గౌరవం ఇదేనా?
ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన సొంత నియోజకవర్గానికి రావాలంటే కోర్టు అనుమతి కోరుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎంటో తేటతెల్లమవుతుందని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లు ప్రతిపక్షాలకు ఎంత గౌరవం ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు.
ఫేక్ ఓట్లు ఎందుకు?
తాను విదేశాల్లో ఉన్నప్పుడు చంద్రబాబును ఎత్తేసి జైలులో వేశారనడం దిగజారుడు వ్యాఖ్యలన్నారు. వై నాట్ 175 అంటున్నారు.. మరి వైసీపీ నేతలంతా ఎందుకు జంప్ అవుతున్నారు? నిజంగా అద్భుతమైన పాలన ఇచ్చివుంటే ఫేక్ ఓట్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో ఎవరూ ఇంత దుర్మార్గంగా పాలన చేయలేదని విమర్శించారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం మాయమాటలు చెబుతున్నారని..ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.