Tirumala : తిరుమల తిరుపతి శ్రీవారి భక్తుల వసతి గదులకు సంబంధించి టీటీడీ (TTD) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈవో ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) ద్వారా తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయి.. ఎంత మంది భక్తులకు వసతి కల్పించవచ్చు అనే అంశాల గురించి ఈవోకు తెలియజేశారు. సీడీ రీఫండ్, దళారులను గుర్తించడంతో పాటు వారిని నియంత్రించే మార్గాలు, తిరుపతి (Tirupati) లో అందుబాటులో ఉన్న వసతి, కొత్తగా నిర్మాణంలో ఉన్న పీఏసీలు, ఇతర సంబంధిత అంశాలపై ఈవో సమీక్షించారు.
తిరుమలలో పదే పదే వసతి పొందుతున్న వారి వివరాలు, గదులు సక్రమంగా ఖాళీ చేయకపోవడం, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు.టీటీడీ ఈవో బాధ్యతలు చేపట్టిన ఈవో జే శ్యామలరావు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. లోటుపాట్లను గమనించి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గదుల అంశంపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు.
Also read: ఇంటి వద్దకే పింఛన్లు..శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!