TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.

New Update
TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన

TTD EO Dharma Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. పూర్వం రోజుల్లో రాజులు స్వామి వారి దర్శనానికి వేళ్లే సమయంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అలిపిరి (Alipiri) మార్గంలో రెండు వైపులా కూడా రాతి మండపాలు నిర్మించినట్లు ఆయన వివరించారు.

ఆ మండపాల్లో ఒకటి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, ఈ మండపాన్ని గతంలో ఒకసారి మరమ్మతులు చేశారని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ మండపానికి మరమ్మతులు చేయడానికి వీలు లేదని టీటీడీ ఇంజనీరింగ్‌ నిపుణులు ఇచ్చిన నివేదిక ప్రకారమే..దానిని పునర్‌ నిర్మించాలని టీటీడీ (TTD) నిర్ణయించినట్లు ఆయన వివరించారు.

Also read: నాటి మిత్రులే.. నేటి శత్రువులు.. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మధ్య వివాదం ఏంటి?

మండపానికి వెనుక వైపు ఉన్న గోడ పూర్తిగా కూలిపోయిందని మండపంలోనికి భక్తులు వెళ్లకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 20 పిల్లర్లతో మండపాన్ని నిర్మించినున్నట్లు తెలిపారు. తిరుమలలోని పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకున్నందున దానిని నిర్మించినప్పుడు కూడా కొందరు సామాజిక మధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారు.

ఇక నుంచి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నడక మార్గంలో చిరుతల సంచారం తగ్గడంతో కొన్ని ఆంక్షలు సడలించమన్నారు. అందుకే తిరుమల ఘాట్ రోడ్‌ లో బైకుల్ని కూడా రాత్రి పది గంటల వరకు అనుమతులిస్తామన్నారు. నడక దారిలో మధ్యాహ్నం 2 గంటల తరువాత చిన్న పిల్లల్ని కూడా అనుమతించడం పై అటవీ శాఖ నుంచి ఆదేశాలు రాలేదన్నారు. జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడూ నిఘా ఉంచామన్నారు.

సీసీ కెమెరాలు, ట్రాప్‌ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆరు చిరుతల్ని బంధించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
భక్తులు అవాస్తవాలను నమ్మోద్దని టీటీడీ కోరింది. ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు అలిపిరిలో కూడా మరో మండపాన్ని నిర్మించేందుకు సిద్దమవుతున్నారన్నారు.

Advertisment
తాజా కథనాలు