TTD Employee Illicit Relationship : ప్రేయసి కోసం భార్యకు వేధింపులు కిరోసిన్‌ పోసుకుని..

భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భరించలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్ధానంలో అసిస్టింట్ షరాబ్‌గా విధులు నిర్వహిస్తున్న వై.తులసి రామ్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు ఈ విషయంలో భార్య భర్తలు గొడవలు పడేవారు. విడాకులు కావాలంటూ భర్త తులసీ రామ్ తోపాటు అతని మేనమామ సైతం బెదిరింపులకు పాల్పడ్డంతో భార్య భారతి కిరోసిన్‌ పొసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందింది.

New Update
TTD Employee Illicit Relationship : ప్రేయసి కోసం భార్యకు వేధింపులు కిరోసిన్‌ పోసుకుని..

TTD Employee Illicit Relationship : వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్ధానం(TTD)లో  అసిస్టెంట్ షేరాబ్ గా విధులు నిర్వహిస్తున్న తులసీ రామ్(tulasi ram)..వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య నుండి విడిపోవాలని తులసి రామ్‌ అనేక సందర్భాల్లో భార్య భారతి(Bharati)ని చిత్ర హింసలకు గురి చేసేవాడు. విడాకులు కావాలని తన బంధువుల చేత బెదిరింపులకు పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన భారతి గత వారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందింది.

తల్లి మరణంతో కూతురు నిఖిత కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తల్లి చావుకు తండ్రే కారణం కావడంతో దిక్కుతోచని పరిస్ధితిలో ఉంది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. భారతి(Bharati) మృతిపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తులసీ రామ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాహేతర సంబంధాలతో వేలాది కుటుంబాలు విధిన పడుతున్నాయి. ప్రతి రోజు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. వివాహేతర సంబంధాలకు కారణం స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అనే తేడా లేదు. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తిగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా.. పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి. పిల్లలు ఆనాధలుగా మారుతున్న పరిస్ధితి కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు