TTD News: వారికి జీతాలు పెంపు.. ఉద్యోగులపై టీటీడీ వరాల వర్షం!

ఇంటి స్థలాలు పంపిణీ, జీతాల పెంపు లాంటి నిర్ణయాలతో ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.

TTD News: వారికి జీతాలు పెంపు.. ఉద్యోగులపై టీటీడీ  వరాల వర్షం!
New Update

తిరుమల తిరుపతి దేవస్థానాల(TTD) ఉద్యోగులపై టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మరో సారి వరాల వర్షం కురిపించారు.తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ (గుండుకు ఇంత లెక్కన) పని చేస్తున్న క్షురకులకు ఎవ్వరూ ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. వీరి బాధలు, ఇబ్బందులు మనసుతో ఆలోచించి నెలకు 20 వేల రూపాయల కనీస వేతనం అందించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 250 కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. కరుణాకర రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై పీస్ రేట్ క్షురకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఊహించని విధంగా కరుణాకర రెడ్డి జీవితంలో మరచిపోలేని సహాయం చేశారని కృతజ్ఞతలు చెబుతున్నారు.

టీటీడీ చైర్మన్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవే:

➡ కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు 20 వేల వేతనం.

➡ పోటు కార్మికులకు 10వేల జీతం పెంపు.

➡ చిన్నజీయర్ , పెద్ద జీయర్ మఠాల నిర్వహణ, ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం అదనంగా ఏటా కోటి రూపాయల సహాయం.

➡ వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపు.

➡ డిసెంబరు 28 నుంచి ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ.

➡ మరో 350 ఎకరాల భూమి కొనుగోలుకు నిర్ణయం

➡ టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు 10వేల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది.

➡ వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.

➡ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్ద జీయర్ మఠానికి ఏటా 60 లక్షలు,చిన్న జీయర్ మఠానికి ఏటా 40 లక్షల అదనపు ఆర్ధిక సహాయం చేయాలని భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది.

➡ టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం రూ.3వేలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 వేల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు.

➡ టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత నాది అని ప్రకటించిన చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తన మాట నిలుపుకుంటున్నారు. డిసెంబర్‌ 28న తొలి విడతగా 3518 మంది ఉద్యోగులకు మహతి ఆడిటోరియంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయబోతున్నారు.

➡ మరో వారం పది రోజుల్లో ఇంకో 1,500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

➡ ప్రభుత్వానికి 80 కోట్ల రూపాయలు చెల్లించి మరో 350 ఎకరాల భూమి సేకరించి ఫిబ్రవరిలోపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.

➡ 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి పదవీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన నాయకత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. మళ్ళీ 16 సంవత్సరాల తరువాత భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు.

Also Read: అతను లేకపోవడం పెద్ద లోటు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ ఏం అన్నాడంటే?

WATCH:

#tirumala #ttd #bhumana-karunakar-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe