TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!!

ఈనెల అక్టోబర్ 29వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా 8గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.:22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ కారణంగా 28 వతేదీ రాత్రి 7గంటల నుంచి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

New Update
TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!!

తిరుమల వెళ్లాలని ప్లాన్ లో ఉన్న శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. అక్టోబర్ 29న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 8గంటల పాటు మూసివేయనున్నారు. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగానే 28వ తేదీ రాత్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. తిరిగి 29వ తేదీ తెల్లవారుజామున 3. 15 గంటలకు ఆలయం తలుపులు తె,రుచుకుంటాయి. 8గంటలపాటు శ్రీవారి భక్తులు దర్శనం రద్దు అవుతుంది. గ్రహణం కారణంకాగా సహస్రదీపాలంకారణ సేవ, వికలాంగులు, వయో వ్రుద్దులకు దర్శనం రద్దు చేస్తున్నారు.

ఇక వరసపెట్టి సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. పెరటాసి నెల రద్దీ కారణంగా ఎస్డీ టోకెన్లను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకోవాలని కోరింది.

ఇది కూడా చదవండి: ఈ రాశుల వారికి ఈ నెలలో మహర్దశ.. ఆ రాశులివే?

అటు ఏడుకొండల్లో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు. వివిధ మార్గాల్లో తిరుమల చేరుకునే భక్తులు ఆ ఏడు కొండలవారిని దర్శించుకుని పులకించిపోతారు. అయితే నడకమార్గంలో పులల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 22వ తేదీన అనంతపురం జిల్లాకు చెందిన కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. కానీ ఆ బాలుడు చిరుత దాడి నుంచి తప్పించుకుని మృత్యుంజయుడై బయటపడ్డాడు.

అయితే ఇదే ఏడాది ఆగస్టు 12వ తేదీన అలిపిరి మెట్ల మార్గంలో తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న లాక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టీటీడీ అలర్టయ్యింది. నడకదారిన వెళ్లే భక్తులను అప్రమత్తం చేసింది. అయినా కడా తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లేందుకు కూడా భక్తులు జంకుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఫుడ్స్ తింటే.. మీ ఊపిరితిత్తులు సేఫ్..!!

కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులు, మొదటి ఘాట్ రోడ్డులో చాలాసారు చిరుతలు కనిపించాయి. చిరుతలను చూసినట్లుగా టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్డులతోపాటు నడకదారిలోనూ అధికారులు ఆంక్షలు విధించారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది. మధ్యాహ్నం నడక దారిలో వెళ్లే భక్తులకు ఉతకర్రను ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో 12ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు కూడా ఆంక్షలు విదించారు. ఉదయం 6గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే టూవీలర్స్ కు అనుమతిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వేయికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!

నడకమార్గంలో ట్య్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత జాడలను గుర్తిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఆరు చిరుతలను బంధించారు. దీంతో మెట్ల మార్గంలో చిరుతల సంచారం తగ్గింది. వారం రోజులుగా చిరుతల సంచారం నమోదు కాలేదు. దీంతో శ్రీవారి భక్తులకు స్వల్ప ఉపశమాన్ని కల్పిస్తోంది టీటీడీ. టూవీలర్ పై తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది టీటీడీ. ఎప్పటిలాగే ఉదయం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఘాట్ రోడ్డులో టూవీలర్ కు అనుమతి ఇచ్చింది. దీంతో దూరప్రాంతాల నుంచి టూవీలర్ పై తిరుమలకు వచ్చే భక్తులకు ఇది శుభవార్తే.

Advertisment
తాజా కథనాలు