TSRTC: మగాళ్లకూ మంచిరోజులు వచ్చేశాయ్..పురుషులకోసం ప్రత్యేక బస్సులు...కండీషన్స్ అప్లయ్..!!

హైదరాబాద్ ల్ తొలిసారిగా పురుషులకు ప్రత్యేక బస్సులను కేటాయించింది ఆర్టీసీ. పురుషులకు మాత్రమే అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను తీసుకువచ్చింది. కొన్ని రూట్లలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది.

RTC: సంక్రాంతి రికార్డును బ్రేక్‌ చేసిన ఆర్టీసీ.. మూడు రోజుల్లోనే ఎంతమంది ప్రయాణించారంటే!
New Update

TSRTC: తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ బాగా పెరిగింది. బస్సులో మహిళలు కొట్లాటలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పురుషులకు బస్సులో సీట్లు దొరకడమే కష్టంగా మారింది. ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదనతో రోడ్డెక్కుతున్నారు. హైదరాబాద్ లో మెట్రోకు భారీగానే ఆదాయం తగ్గింది. ఈ సమయంలో పురుషులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పురుషులకు మాత్రమే అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను రోడ్డపైకి తీసుకువచ్చింది.

అటు బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో బస్సు మొత్తం మహిళలే కనిపిస్తున్నారు. పురుషులకు సీట్లు కాదు నిల్చునేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ విషయాన్ని కండక్టర్లు ఆర్టీసీ ఎండీ ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని రూట్లు, కొన్ని సమయాల్లోనే పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపే అంశం తెరపైకి తీసుకువచ్చింది. విద్యార్థులకు కూడా ప్రత్యేక బస్సులను నడిపే విషయాన్ని అధికారులు యాజమాన్యానికి వివరించారు. సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంపై చర్చించారు.

ఇదికూడా చదవండి: ఖమ్మం ఎంపీ టికెట్.. కోటి ఆశలతో హనుమంతరావు!

దీంతో ఏయే మార్గాల్లో ప్రత్యేక బస్సులు అవసరం అవుతాయన్న దానిపై అధికారులు అధ్యయనం చేశారు. ప్రత్యేక బస్సులు నిర్వహించడమా లేదా బస్సుల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించడమా అనే విషయంపై తర్జన భర్జన పడ్డారు. ప్రత్యేకంగా పురుషులకు బస్సులు నడిపితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న దానిపై ట్రయిర్ రన్ ప్రారంభించారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో తాజాగా పురుషులకు మాత్రమే బోర్డులతో బస్సులు కనిపిస్తున్నాయి. ఈబస్సుల్లో మహిళలకు అనుమతి ఉండదు. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ రూట్లలో ఈ బస్సును నడిపించారు. ఇప్పటికే బస్సుల్లో రోజుకు 30లక్షల మందికిపైగా మహిళలు ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే దీనిని అమలు చేస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే.

#special-buses-for-men #tsrtc #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe