/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TSRTC-New-Rule--jpg.webp)
తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ (TS Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించింది. మొదటగా మహిళల ఫ్రీ బస్సు జర్నీని ప్రారంభించింది. ప్రభుత్వ సూచనల మేరకు మొదటి వారం పాటు మహిళలందరినీ ఎలాంటి కార్డు లేకుండానే అనుమతించింది ఆర్టీసీ (TSRTC). తాజాగా పలు నిబంధనలను జారీ చేసింది. సరైన ధృవీకరణ పత్రం చూపించి జీరో టికెట్ తీసుకోవాలని మహిళలకు ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటాం: ఖమ్మం మహిళలు
సరైన ధృవీకరణ పత్రం లేకుండా ఫ్రీ జర్నీ చేస్తే రూ.500 జరిమానా ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. స్థానికతను రుజువు చేసే ధృవీకరణ పత్రం లేకపోతే టికెట్ తీసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: TS RTC: సీట్లన్నీ ఆడవాళ్లకేనా!.. బస్సుకు అడ్డం నిలుచున్న మగజాతి ఆణిముత్యం
ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కండెక్టర్‌కు చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు కార్డు చూపించిన ప్రతీ మహిళకు జీరో టికెట్ జారీ చేయాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిబ్బందికి సూచించారు.