బైక్‌ యాక్సిడెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్టీసీ ఎండీ

New Update

httpstwitter.comSajjanarVCstatus1668082748211494912httpstwitter.comSajjanarVCstatus1668082748211494912

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌ని క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని యువతకు, ప్రజలకు అధికారులు అవగాహనా కార్యక్రమాలను ఎన్ని నిర్వహించినా ఫలితం లేకుండా పోతుంది. ఇదిలా వుంటే.. రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తూ ఓ వీడియో ట్వీట్ చేశారు.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలకు లోనవుతుంటారు. రాష్ డ్రైవింగ్‌తో, ఓవర్ టేక్ చేస్తూ వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు రాంగ్ రూట్‌లో వెళ్తూ ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించేలా వాహనాలను నడుపుతారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన చాలామంది అవయవాలను కోల్పోతున్నారు. మరికొందరైతే ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు షోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలా ఓ అమ్మాయి రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై అడ్డురావడంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు దాటే క్రమంలో రాంగ్ రూట్‌లో వెళ్లింది. మరో ఇద్దరు యువకులు బైక్‌లపై స్పీడ్‌గా వస్తున్నారు. సడన్‌గా ఆ అమ్మాయిని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న షాపు మెట్లను బలంగా ఢీకొట్టాడు. వెంటనే అతను గాల్లోకి ఎగిరిపడిపోయాడు. మరోవ్యక్తి కిందపడిపోయాడు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అమ్మాయి రాంగ్ రూట్‌లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా సజ్జనార్.. యూటర్న్‌ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయణం డేంజర్! అన్నారు. మీతోపాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారని.. జాగ్రత్తగా ఉండాలని.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.

సజ్జనార్ సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందిని ఎప్పటకప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. సిబ్బంది సేవలను గుర్తించి అభినందిస్తారు. ప్రజలు ఆర్టీసీ సేవలు పొందుటకు అనేక ఆఫర్స్ కూడా అందిస్తున్నారు. ఆర్టీసీ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్ల ప్రయత్నం చేస్తారు. రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ రూల్స్ సూచనలు చేస్తారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహనా కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శంగా నిలిచారు. ప్రజలకు అందుబాటులో ఉండి పలు సూచనలిస్తారు.

https://twitter.com/SajjanarVC/status/1668082748211494912

Advertisment
Advertisment
తాజా కథనాలు