TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..

తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది.

New Update
TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..

TSRTC Announced 8th DA: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు మరో డీఏ ప్రకటించింది. పెంచిన డీఏ ని సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. 'పెండింగ్‌లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది.' అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు 7వ డీఏను ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం. 2022 జులైకి సంబంధించిన 4.9 శాతం డీఏని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీఏను గత జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చారు. ఇప్పుడు మరో డీఏని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో బిల్లును పాస్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లు అమల్లోకి రావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కానీ, గవర్నర్ ఈ బిల్లును ఇప్పటికీ ఆమోదించలేదు. ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును రాష్ట్ర గవర్నర్‌ తమిళి.. న్యాయశాఖ పరిశీలనకు పంపారు. దాంతోపాటు కొద్ది నెలలుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య తిరుగుతున్న మరో నాలుగు బిల్లులను కూడా న్యాయశాఖ పరిశీలనకు పంపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీన అంశం కొనసాగుతోనే ఉంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ యాజమాన్యం తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తాజాగా పెంచిన డీఏతో సెప్టెంబర్ నెల నుంచి ఉద్యోగుల జీతం కూడా పెరగనుంది.

సింగరేణి కార్మికులకు పాత బకాయిల చెల్లింపులు..

ఎస్‌సిసిఎల్‌ ఉద్యోగులకు 23 నెలల 11వ వేతన బకాయిలను విడుదల చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.4 లక్షలు అందనుంది. మొత్తం 40,000 మంది ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. నెల రోజుల్లో మొత్తం కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. హెచ్ఆర్, అకౌంట్స్, ఆడిటింగ్, ఈఆర్‌పీ, ఎస్‌ఏపీ, ఐటీ, ఇతర విభాగాల సమన్వయంతో జీతాల బకాయిల గణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్ & పర్సనల్) బలరామ్. ఉద్యోగులకు చెల్లించని జీతాలపై ఆడిట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే, పదవీ విరమణ పొందుతున్న కార్మికులకు, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు.

Also Read:

Fake Seeds Effects On Farmers: నకిలి విత్తనాల దందా..ఆందోళనలో అన్నదాతలు

Deepthi Case: దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చెల్లి చందననే హంతకురాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు