TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. 5,265 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలతోనే ప్రయాణించవచ్చని ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ.

TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త
New Update

TSRTC Special Buses For Dussehra Festival: తెలంగాణలో అతి పెద్ద పండుగలు బతుకమ్మ (Bathukamma), దసరా అన్న విషయం తెలిసిందే. ఈ పండుగలకు స్కూళ్లకు పది రోజులకు పైగానే సెలవులు (Dussehra Holidays) ఉంటాయి. దీంతో ఏ పండుగకు వెళ్లినా, వెళ్లకపోయినా బతుకమ్మ, దసరా పండుగకు మాత్రం ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఆ పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాలన్నీ ఖాళీ అయ్యి, పల్లెలలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం (Hyderabad) నుంచి భారీగా ప్రజలు దసరాకు సొంత గ్రామాలకు, పట్టణాలకు వెళ్తూ ఉంటారు. గతంలో దసరా తదితర ముఖ్యమైన పండుగలు వచ్చాయంటే చాలు స్పెషల్ బస్సుల్లో 50 శాతం మేర అదనపు ఛార్జీలను విధించేవారు.
ఇది కూడా చదవండి: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు

అయితే.. గత రెండు, మూడేళ్లుగా ఈ పరిస్థితి మారింది. స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దసరా పండుగ సమీపించిన వేళ తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది.

ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తన ప్రకటనలో పేర్కొంది. రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ.

#tsrtc #tsrtc-special-buses #dasara-special-buses #tsrtc-dasara-special-buses #tsrtc-5265-special-buses-for-dussehra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe