హైదరాబాద్-విజయవాడ టీఎస్ఆర్టీసీ బస్సులు రద్దు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన చేశారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే రెగ్యులర్‌ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

New Update
హైదరాబాద్-విజయవాడ టీఎస్ఆర్టీసీ బస్సులు రద్దు

రెగ్యులర్ సర్వీసులు రద్దు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ రద్దు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.

గుంటూరు మీదుగా బస్సులు.. 

ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపడం జరుగుతోందని తెలిపారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుందని.. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు కూడా కీలక సూచనలు చేశారు.

హైవేపై రాకపోకలు బంద్.. 

భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు వరద నీటిలో జలదిగ్భందమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలకే కాదు.. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వయా విజయవాడ మీదుగా వెళ్లేవారు.. హైదరాబాద్‌ – నార్కట్‌పల్లి – మిర్యాలగూడ – దాడేపల్లి – పిడుగురాళ్ల -సత్తెనపల్లి – గుంటూరు – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవాలి. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వయా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు.. విశాఖపట్నం – రాజమండ్రి – ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ-దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి రూట్‌లో హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

దాదాపు 2008 తర్వాత ఈ స్థాయిలో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 మీటర్ల మేర హైవేపై నీటి ప్రవాహం పెరిగినట్టు వెల్లడించారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. గతంలో మూడురోజుల పాటు ఇలానే వరద నీరు జాతీయరహదారిపై ప్రవహించినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు